ETV Bharat / state

ఎన్నికల వేళ రౌడీషీటర్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్ - జంట నగరాలు, శివారు ప్రాంతాల్లోని వారిపై డేగ కన్ను

Police Officers Special Focus on Rowdy Sheeters During Elections : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెట్టారు. నేరాలకు పాల్పడకుండా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నారు. రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ల కదలికలపై నిఘా పెట్టారు.

Police Officers Special Focus on Rowdy Sheeters Actions
Police Officers Special Focus on Rowdy Sheeters During Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 1:33 PM IST

Police Officers Special Focus on Rowdy Sheeters During Elections : హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. కొన్ని నేరాల్లో కనిపించకుండా పోయిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరికొంతమంది ఇంటికి నేరుగా వెళ్లి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. కొంతమంది పాత నేరస్థులు పోలీసుల హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి పలువురిని బెదిరిస్తున్నారనే సమాచారంతో వాళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జంట నగరాలు, శివారు ప్రాంతాల్లోని రౌడీషీటర్లపై డేగ కన్ను వేశారు.

నేతల ఫిర్యాదులపై ఈసీ నజర్​-జోరుగా పోలీసుల బదిలీలు

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తారనే అనుమానం ఉన్న వాళ్లను బైండోవర్ చేస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో దాదాపు 3500 మంది రౌడీషీటర్లు రికార్డుల్లో నమోదయ్యారు. వీరితో పాటు వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వాళ్లపైనా పోలీసులు నిఘా పెట్టారు. నగరం, శివారు ప్రాంతాల్లో ప్రైవేటు దందాలు, రియల్‌ వ్యాపారం, హోటళ్లు, హవాలా, హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్న ఏ-వన్‌ రౌడీషీటర్లు వెయ్యి మంది వరకు ఉన్నట్టు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది.

Police Officers Counselling to Rowdy Sheeters : లంగర్‌హౌజ్, ఆసిఫ్‌నగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో సెటిల్ మెంట్లు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్ల వివరాలు, కదలికలపై దృష్టిసారించి ఇన్స్‌పెక్టర్లు ప్రతినెలా వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తిస్తే బైండోవర్‌ చేయాలి. రౌడీషీటర్ల విషయంలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో బోరబండ ఇన్స్పెక్టర్‌ను సీపీ సందీప్ శాండిల్య బదిలీ చేశారు.

Police Impose Election Code Strictly in Telangana : పోలీసుల విస్తృత సోదాలు.. భారీగా పట్టుబడుతున్న అక్రమ నగదు, బంగారు ఆభరణాలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇన్‌స్పెక్టర్లను ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రౌడీషీటర్ల బైండోవర్‌ వేగవంతం చేశారు. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ మండలాల పరిధిలో ఎక్కువమంది రౌడీషీటర్లు ఉన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా వాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఏసీపీ, డీపీసీ స్థాయి అధికారులు కౌన్సిలింగ్‌లో పాల్గొంటూ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొంతమందిని తహసీల్దార్, ఆర్డీవోల వద్ద హాజరుపరుస్తున్నారు.

Police Officers Special Focus on Rowdy Sheeters Actions : ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న రౌడీషీటర్లపై పోలీసు అధికారులు దృష్టి కేంద్రీకరించారు. కేపీహెచ్​బీ ఠాణాలో అత్యధికంగా ఐదుగురు రౌడీషీటర్లు కనిపించకుండా ఉన్నారు. సూరారంలో నలుగురు, ఎస్సార్​నగర్‌లో నలుగురు, తుకారంగేట్‌లో నలుగురు, సైదాబాద్‌లో ఇద్దరు, పేట్‌బషీరాబాద్‌లో ఇద్దరు, కంచన్‌బాగ్‌లో ఇద్దరు.. ఇలా పలు ఠాణాల పరిధిలో పాత నేరస్థులు అజ్ఞాతంలో ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం వారంతా ఎక్కడున్నారనే ఆరా తీస్తున్నారు.

EC Focus On Social Media in telangana : ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పోలీసుల నిఘా.. గీత దాటితే తాట తీయడమే!

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్‌ శాండిల్య.. పలువురు మహిళ పోలీసు అధికారులను బాధ్యులుగా నియమించారు. ఇందులో భాగంగా మధ్య మండలం పరిధిలో డీసీపీ పుష్ప, ఉత్తర మండలంలో డీసీపీ చందన దీప్తి, తూర్పు మండలంలో ఎసీపీ ప్రసన్న లక్ష్మి, దక్షిణ మండలం శిల్పవల్లి, సౌత్‌ వెస్ట్‌ మండలంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ నికిత పంత్‌, సౌత్‌ ఈస్ట్‌ మండలంలో కవిత, పశ్చిమ మండలంలో టీఎస్‌న్యాబ్‌ డీపీసీ సునీతా రెడ్డి ఆయా మండలాల్లోని రౌడీషీటర్ల నివాసానికి వెళ్తున్నారు.

ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - గుట్టుగా కార్లలో తరలిస్తున్న 3.2 కోట్ల సొత్తు సీజ్

వారి కుటుంబసభ్యులతో మాట్లాడి.. కదలికల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో రౌడీషీటర్ల పై మరింత నిఘా ఉంచామని.. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వివాదాల్లో తలదూర్చవద్దని పేర్కొన్నారు. వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న తర్వాత..బయట ఎక్కువగా సంచరించవద్దని రౌడీషీటర్లకు మహిళ పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Police Officers Special Focus on Rowdy Sheeters During Elections ఎన్నికల వేళ రౌడీషీటర్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్ మూడు కమిషనరేట్లలో వారికి కౌన్సిలింగ్

రైతుబంధు, డీఏ చెల్లింపుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాం : సీఈవో

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.