లుకేమియా వ్యాధితో పోరాడుతున్న ఓ బాలిక కలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ నిజం చేశారు. మంగళ వారం ఒక్కరోజు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించారు. అల్వాల్ సుచిత్రకు చెందిన 17ఏళ్ల రమ్య ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. చదువులో అందరికన్న ముందుండే రమ్య... గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ 'లుకేమియా'తో బాధపడుతోంది. చిన్ననాటి నుంచి పోలీస్ ఆఫీసర్ కావాలని కలలుగన్న తమ బిడ్డ కోరికను మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధులకు చెప్పారు రమ్య తల్లిదండ్రులు. సంస్థ ప్రతినిధులు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ను కలిసి బాలిక విషయం తెలిపారు. రమ్య పరిస్థితి తెలుసుకున్న సీపీ... బాలిక కలను నిజం చేయడానికి ఒప్పుకున్నారు. మంగళవారం ఒక్కరోజు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమ్య పోలీసులకు తగు సూచనలు చేసింది. పెట్రోలింగ్‌ని పెంచాలని... శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడానికి కృషి చేయాలని తెలిపింది. తమ బిడ్డ కలను నెరవేర్చిన పోలీసు అధికారులకు రమ్య తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రమ్య త్వరగా కోలు కోవాలని....పోలీస్ శాఖ అండగా ఉంటుదని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
ఇదీ చూడండి: బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ