ETV Bharat / state

రాంప్రసాద్​ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

పంజాగుట్టలో హత్యకు గురైన  రాంప్రసాద్​ కేసులో ఆరుగుర్ని అరెస్ట్​ చేసిన పోలీసులు మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కోటి రూపాయిలు సుపారీ ఇచ్చి చంపించినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపార లావాదేవీలే హత్యకు దారితీశాయని నిర్ధారణకొచ్చారు.

author img

By

Published : Jul 11, 2019, 6:52 AM IST

Updated : Jul 11, 2019, 7:46 AM IST

రాంప్రసాద్​ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
రాంప్రసాద్​ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్​ పంజాగుట్టలో హత్యకు గురైన వ్యాపారి రాంప్రసాద్​ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య చేసేందుకు కిరాయి ముఠాకు కోటి రూపాయల సుపారీ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రధారి కోగంటి సత్యం... హత్య జరిగినప్పుడు చుట్టుపక్కనే ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇప్పటికే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు, మిగతా ముగ్గురు కోసం గాలిస్తున్నారు.

హత్యకు రెండు నెలల రెక్కీ..

వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన విభేదాల వల్ల రాంప్రసాద్​ను కోగంటి సత్యం హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో కోగంటి సత్యం, శ్యామ్, రమేశ్, చోటూను రెండు రోజులుగా ప్రశ్నిస్తున్న పోలీసులు.. వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఆంజనేయ ప్రసాద్, నరేశ్​లను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరి పర్యవేక్షణలోనే హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది.

కోగంటి సత్యం, ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత కలిసి కామాక్షి స్టీల్ పేరుతో కంపెనీ స్థాపించారు. స్థానికంగా కార్మిక నేతగా గుర్తింపున్న కోగంటి సత్యం పలు వివాదాల్లో జోక్యం చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. కోగంటి సత్యంతో విభేదాలు వచ్చి తన వాటాను రాంప్రసాద్​కు విక్రయించాడు సదరు రాజకీయ నాయకుడు. కొన్నాళ్లపాటు రాంప్రసాద్, కోగంటి సత్యం ఉమ్మడిగా వ్యాపారం నిర్వహించారు. అనంతరం వ్యాపారంలో 70 కోట్ల నష్టం వచ్చినట్లు రాంప్రసాద్ లెక్కలు చూపించటం వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

వ్యాపార లావాదేవీలే కారణం..

ఇద్దరి మధ్య విభేదాలు ముదిరి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మధ్యవర్తి ద్వారా రాంప్రసాద్, కోగంటి సత్యానికి 23 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. రాంప్రసాద్ అయిదేళ్ల క్రితం హైదరాబాద్​కు మకాం మార్చాడు. డబ్బులు ఇవ్వనందుకే హత్య చేయించినట్లు పోలీసులు ఎదుట సత్యం అంగీకరించినట్లు సమాచారం. రాంప్రసాద్​ ప్రతి శనివారం వేంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తాడన్న సమాచారంతో సుమారు ఏడుగురు నిందితులు అక్కడ మాటువేసినట్లు సీసీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిర్ధరించుకున్నారు.

దాడి చేసింది ముగ్గురే..

ముగ్గురు నిందితులు రాంప్రసాద్​ను కత్తులతో దాడి చేయగా, మిగతా నలుగురు వాహనం సమీపంలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో తిరిగి మళ్లీ పంజాగుట్టకు వచ్చి అక్కడి నుంచి గచ్చిబౌలి వెళ్లి అక్కడే వాహనం వదిలేసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల పాత్ర తేల్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

ఇవీ చూడండి: కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

Intro:Body:Conclusion:
Last Updated : Jul 11, 2019, 7:46 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.