అగ్నిప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు.. స్పందించాల్సిన తీరుపై శబరిమలైలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. పంబా నది తీరంలోని ఓ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం అందిన రెండు నిమిషాల్లో అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్ లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే.. పై అంతస్తులో చిక్కుకున్న బాధితులను తాళ్ల సహాయంతో కిందికి దించి ఆసుపత్రికి తరలించారు.
రక్షణ చర్యలు - సవాళ్లు
అనంతరం అగ్నిమాపక సిబ్బంది భవనంలోకి చేరుకొని.. మూర్ఛ పోయిన వారిని తమ భుజాల మీద జాగ్రత్తగా అంబులెన్స్‌లోకి తరలించారు. కేరళ పోలీస్, అగ్నిమాపక శాఖ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్షణ చర్యలు చేపటేందుకు పట్టే సమయం.. సవాళ్లు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పంబా ప్రాంత భద్రతా పర్యవేక్షకులు నవనీత్ శర్మ వివరించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై భక్తులకు, స్థానిక వ్యాపారులకు పలు సూచనలు చేశారు.