TDP LEADERS HOUSE ARREST: చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనలో పోలీసుల తీరుపై.. తెలుగుదేశం తలపెట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలనూ అణచివేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మొదలుకుని.. ముఖ్య నేతల నివాసాల వద్ద తెల్లారే సరికే పోలీసులు మోహరించారు. జాతీయ రహదారి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి ఎవ్వరూ వెళ్లకుండా కంచెలు వేసి.. సర్వీస్ రోడ్డులోనూ రాకపోకలు నిలిపివేశారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే సిబ్బందినీ.. అడ్డుకున్నారు. గుంటూరు వంతరాయపురంలో.. మాజీమంత్రి నక్కా ఆనందబాబును గృహ నిర్బంధం చేశారు. బయటకు వచ్చిన.. ఆనందబాబును పోలీసులు అడ్డగించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆనందబాబు.. కార్యకర్తలతో కలిసి జీవో ప్రతులు తగలబెట్టారు.
గుంటూరులో: గుంటూరు జిల్లాలోని ఇతర నేతలనూ.. పోలీసులు ఇళ్లు దాటనీయలేదు. ధూళిపాళ్ల నరేంద్రను ఆయన స్వగ్రామం చింతలపూడిలో.. గృహనిర్భంధం చేశారు. పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చారు. కార్యకర్తలతో కలిసి జీవోనంబర్ 1 ప్రతులను యరపతినేని తగలబెట్టారు.
నెల్లూరులో: నెల్లూరు జిల్లా కావలి ట్రంకు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసనకుయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరుజిల్లా ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో చీకటి జీవో అంటూ ప్రతులు తగలబెట్టగా పోలీసులు అడ్డుకోవడం తోపులాటకు దారితీసింది. టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
పార్వతీపురంలో: ఇక పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేశారు గరుగుబిల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
శ్రీకాకుళంలో: శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు శిరీష ఆధ్వర్యంలో.. చీకటిజీవో రద్దు చేయాలంటూ.. ర్యాలీ నిర్వహించారు. పలాస టీడీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. జీఓ ప్రతులు దహనం చేశారు.
ఇవీ చదవండి: