హైదరాబాద్ బాహ్యవలయ భద్రతపై హెచ్‌ఎండీఏ కార్యాలయంలో హెచ్‌ఎండీఏ, పోలీసు, ట్రాఫిక్ పోలీసు అధికారులు సంయుక్తంగా సమీక్ష నిర్వహించారు. బాహ్యవలయ రహదారిపై సీసీ కెమెరాలతో పాటు మరిన్ని భద్రత చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని అధికారులు అభిప్రాయపడ్డారు.
ప్రత్యేకమైన సెల్
ఈ సమావేశంలో బాహ్యవలయ రహదారిపై తీసుకోవాల్సిన భద్రతపై కూలంకుషంగా చర్చించారు. టోల్ ఫ్రీ నంబర్లు.. వాహనాల పార్కింగ్ స్థలాలు కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు కార్యకలాపాలను నానక్‌రామ్‌గూడలోని ఎమ్‌టీసీసీ భవనం నుంచి పర్యవేక్షించేందుకు ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి