ETV Bharat / state

తండ్రి బెంగళూరు నుంచి ఫోన్​ చేశాడు.. పోలీసులు హైదరాబాద్​లో కేక్​ కట్​ చేయించారు!

తండ్రి బెంగళూరులో ఉన్నాడు.. పిల్లలు హైదరాబాద్​లో ఉన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో హైదరాబాద్​ రాలేకపోయాడు. ఇప్పుడే కూతురు పుట్టినరోజు కూడా వచ్చింది. తండ్రికి ఫోన్​ చేసి కేక్​ కావాలని అడిగింది. ఏం చేయాలో తోచక తండ్రి.. పోలీసులకు ఫోన్​ చేశాడు. అంతే.. పోలీసులు కేక్​ తీసుకెళ్లారు. కూతురు కేక్​ కట్​ చేసింది. తండ్రి ఇదంతా వీడియో కాల్​లో చూసి సంతోషించాడు. మరిన్ని వివరాలు కావాలా.. అయితే.. ఈ వార్త పూర్తిగా చదవండి.

Police Help For Girl Birth Day In Hyderabad Due To Lock Down Situation
తండ్రి బెంగళూరు నుంచి ఫోన్​ చేశాడు.. పోలీసులు హైదరాబాద్​లో కేక్​ కట్​ చేయించారు!
author img

By

Published : May 15, 2020, 11:30 PM IST

హైదరాబాద్​కు చెందిన విజయ్​ కుమార్​ బెంగళూరులోని గోల్డ్​ ఏజ్​ హోమ్​లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య, ఇద్దరు కూతుళ్లు హైదరాబాద్​లోని కొత్తపేట గ్రీన్​పార్క్​ కాలనీలో ఉంటున్నారు. లాక్​డౌన్​ వల్ల విజయ్​ హైదరాబాద్​ రాలేక.. బెంగళూరులో ఉండలేక ఇబ్బంది పడుతున్నాడు. అయినా.. పరిస్థితుల ప్రభావం వల్ల భార్యకు, పిల్లలకు నచ్చజెప్పి అక్కడే ఉంటున్నాడు. ఇదే సమయంలో విజయ్​ కూతురు రుచిత పుట్టినరోజు వచ్చింది. ప్రతీ సంవత్సరం రుచిత పుట్టినరోజు నాడు.. కుటుంబ సభ్యులందరూ కలిసి కేక్​ కట్​ చేస్తారు. కానీ.. ఈసారి అలా చేయడం కుదరలేదు. కారణం… కరోనా.. లాక్​డౌన్​.

పిల్లలు ఫోన్​ చేస్తుంటే.. విజయ్​కి ఏం చేయాలో తోచలేదు. ఎలాగైనా తన తరపున రుచితకు కేక్​ కట్​ చేయించాలనుకున్నాడు. పోలీసులకు ఫోన్​ చేశాడు. సరూర్​ నగర్​ ఎస్సై సంజీవరెడ్డి స్పందించి.. కేక్​ తీసుకొని విజయ్​ ఇంటికెళ్లాడు. రుచితతో కేక్​ కట్​ చేయించాడు. రుచిత సంతోషంగా కేక్​ కట్​ చేసింది. ఇదంతా వీడియో కాల్​లో చూసి విజయ్​ సంతోషం వ్యక్తం చేశాడు. తన కూతురు పుట్టిన రోజు నాడు సంతోషంగా ఉండేందుకు సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశాడు. మానవతా దృక్పథంతో స్పందించిన పోలీసులు, ఒక కుటుంబం మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతలకు ఈ ఘటన అద్దం పట్టింది.

ఇదీ చూడండి: ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.