ETV Bharat / state

ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఫేస్​బుక్​లో పోస్ట్​... ఆ తర్వాత..? - Hyderabad latest news

ఈ జీవితం వద్దు అనుకున్నాడు. ఇక చనిపోవాలని నిర్ణయించుకుని... ఫేస్​బుక్​లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లైవ్​ పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే అతన్ని రక్షించారు.

Police have rescued a man who was committing suicide in uppal, hyderabad
ఫేస్​బుక్​లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోస్ట్​... ఆ తర్వాత..?
author img

By

Published : Dec 15, 2020, 10:47 AM IST

తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఓ యువకుడు ఫేస్​బుక్​లో పోస్ట్​ పెట్టాడు.. ఆ విషయం పోలీసులకు చేరడంతో అప్రమత్తమైన వారు.. సాంకేతిక పరిజ్ఞానంతో అతను ఉన్న చోటు గుర్తించి కాపాడారు. ఈ ఘటన ఉప్పల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

ఏం జరిగిందంటే..

హైదరాబాద్​ రామంతాపూర్​లోని ఆర్టీసీ కాలనీకి చెందిన ఫోటోగ్రాఫర్​(31) మద్యానికి బానిసయ్యాడు. ఒంటరిగా ఉంటున్నాడు. అతడి కుటుంబసభ్యులు కొనిచ్చిన కెమెరాలను సైతం అమ్మేసుకున్నాడు. తీవ్ర ఒత్తిడితో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా ఫేస్​బుక్​లో లైవ్​ పెట్టాడు. డయల్​ 100కు సమాచారం వచ్చింది.

వెంటనే ఐటీ సెల్​ ద్వారా రవికాంత్​ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. చేతులు కోసుకుంటూ.. ఉరివేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఉప్పల్​ ఎస్సై చందన, సిబ్బందితో వెళ్లి కాపాడారు. దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ మహేశ్​భగవత్​, మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి... సోమవారం ఎస్సై చందన, కానిస్టేబుళ్లు నర్సింగ్​రావు, సంగీత, శ్రీనివాస్​లను అభినందించారు.

Police have rescued a man who was committing suicide in uppal, hyderabad
పోలీసులతో రాచకొండ సీపీ మహేశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.