
అంబర్‌పేటలో సీపీఎల్ మైదానంలో ఉదయం 9గంటలకు మొదలుకావాల్సిన దేహదారుఢ్య పరీక్షలు మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకే వివిధ జిల్లాల నుంచి వచ్చామని.. ఒంటి గంట వరకు కూడా మొదలుపెట్టలేదని వాపోయారు.
అన్ని ఈవెంట్ల తర్వాత 800మీటర్ల పరుగును చివరలో నిర్వహించడం వల్ల నిరసించి వెనుకబడిపోతున్నామని అభ్యర్థులు పేర్కొన్నారు. ఈసారి ఆర్‌ఎఫ్‌ఐడీ అనే కొత్త విధానంలో ఈవెంట్స్ నిర్వహిస్తుండటాన్ని అభ్యర్థులు స్వాగతించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18వేల428 కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకుగాను 2లక్షల 60వేల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు