Police Couple Pre Wedding Shoot in Hyderabad : ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు నూతన వధూవరులుగా కాబోయేవారు ఫ్రీ వెడ్డింగ్ షూట్(Pre-wedding Shoot)లు చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. అందుకోసం వారు వివిధ ప్రాంతాలకు వెళుతూ.. విభిన్న రీతుల్లో ఫొటోలు, వీడియోలకు ఫోజ్‌లు ఇస్తుంటారు. అందులో జీవిత భాగస్వామితో కలిసి ఉన్న ఓ మంచి వీడియోను షూట్ చేసి.. దానినే ఆహ్వానంగా మిత్రులకు, బంధువులకు షేర్ చేస్తుంటారు.
ఇంకా ఆ షూట్‌నే పదిరోజుల నుంచి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, పేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తారు. అయితే ఓ నూతన జంట మాత్రం వినూత్నంగా ఆలోచిస్తూ.. తమ వృత్తిని అందులో చూపించాలనే భావంతో ప్రీ వెడ్డింగ్ షూట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు విమర్శలు చేస్తే.. మరికొంత మంది వారిని మెచ్చుకుంటున్నారు. అదే తెలంగాణ పోలీసు జంట(Telangana Police Couple Wedding Shoot) చేసిన షూట్.
76 వెడ్స్ 46.. లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆలయంలో పెళ్లి
Police Couple Organized Pre-wedding Shoot in Police Dress : త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న తెలంగాణ పోలీసు జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. వారిద్దరూ పోలీసు అధికారులే కావడంతో ఆ అంశాన్ని ప్రతిబించేలా షూట్లో పాల్గొన్నారు. పెళ్లికి ఆహ్వానం పంపుతూ బంధు, మిత్రులకు షేర్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలోకి వెళ్లడంతో ట్రెండ్ అయి మిశ్రమ స్పందన వచ్చింది. దీనిపై కొంత మంది పోలీస్ యూనిఫామ్‌ను సొంత అవసరాలకు వాడుకుంటారా అంటూ విమర్శిస్తే.. మరికొంత మంది మాత్రం సపోర్టు చేశారు. ఈ విషయంపై తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) తన ఎక్స్(Twitter) వేదికగా స్పందించారు.
-
I have seen mixed reactions to this .Honestly ,they seem to be a little overexcited about their marriage and that’s great news, though a little embarrassing.Policing is a very very tough job, especially for ladies. And she finding a spouse in the department is an occasion for all… https://t.co/GxZUD7Tcxo
— CV Anand IPS (@CVAnandIPS) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">I have seen mixed reactions to this .Honestly ,they seem to be a little overexcited about their marriage and that’s great news, though a little embarrassing.Policing is a very very tough job, especially for ladies. And she finding a spouse in the department is an occasion for all… https://t.co/GxZUD7Tcxo
— CV Anand IPS (@CVAnandIPS) September 17, 2023I have seen mixed reactions to this .Honestly ,they seem to be a little overexcited about their marriage and that’s great news, though a little embarrassing.Policing is a very very tough job, especially for ladies. And she finding a spouse in the department is an occasion for all… https://t.co/GxZUD7Tcxo
— CV Anand IPS (@CVAnandIPS) September 17, 2023
Police Couple Pre Wedding Shoot CV Anand Tweet :ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోను రీ ట్వీట్ చేస్తూ.. ఈ వీడియోపై మిశ్రమ స్పందన వచ్చింది. నిజానికి చెప్పాలంటే ఆనందంలో వారిద్దరూ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ విషయం గొప్ప విషయమే కావొచ్చు. కానీ, కొంచెం ఇబ్బందిగా ఉంది. పోలీసు ఉద్యోగం చాలా చాలా కష్టమైన పని.. ప్రత్యేకించి మహిళలకు ఇంకా కఠినం ఆ పని. పోలీసు అధికారులు ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వడం కచ్చితంగా సంతోషించదగిన విషయమే.
సరిహద్దులు దాటిన మరో 'పెళ్లి' కథ.. ఆన్లైన్లో రాజస్థాన్ యువకుడు- పాక్ యువతి వివాహం
Hyderabad Commissioner CV Anand Tweet : వారు పోలీసు డిపార్ట్మెంట్ దుస్తుల్ని, చిహ్నాలను ఉపయోగించడాన్ని తాను తప్పుబట్టడం లేదని తెలిపారు. కానీ వారు ముందే పోలీసు అధికారులను సంప్రదించి అనుమతి కోరితే.. కచ్చితంగా ఇచ్చేవారిమి కదా అని చెప్పారు. ఆ పోలీస్ జంట చేసిన పని మనలో కొందరికీ ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు.. కానీ వారు పెళ్లికి తనను పిలవనప్పటికీ వెళ్లి వారిని కలుసుకొని ఆశీర్వదించాలని భావిస్తున్నట్లు వివరించారు. అయితే మరలా ఇలా అనుమతి లేకుండా ప్రీ వెడ్డింగ్ షూట్లు వంటివి చేయవద్దని అందరికీ సలహా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Marriage Fear Counseling : 'పెళ్లంటే నూరేళ్ల మంట' అని భయపడుతున్నారా? ఈ నిపుణుల సలహాలు మీకోసమే!