ETV Bharat / state

Amaravati Movement: 550వ రోజుకు చేరుకున్న పోరాటం - amaravathi capital latest news

నేటితో ఆంధ్రప్రదేశ్​లో అమరావతి ఉద్యమం 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం సమీపంలోని చెక్​పోస్టులను తనిఖీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఐకాస ముఖ్యనేతల ఇళ్ల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Amaravati Movement
Amaravati Movement: 550వ రోజుకు చేరుకున్న పోరాటం
author img

By

Published : Jun 19, 2021, 10:10 AM IST

ఆంధ్రప్రదేశ్​లో ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నేటితో 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు రైతులు యత్నిస్తున్నారన్న సమాచారంతో తాడేపల్లిలో భారీగా బలగాలను మోహరించారు. అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం నివాసం సమీపంలోని చెక్​పోస్టులను తనిఖీ చేశారు.

ఇవాళ్టి ఆందోళనలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం ఇంటి పరిధిలో కొత్త వారికి ఆశ్రయం కల్పిస్తే.. వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐకాస ముఖ్య నేతల ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు. మహిళా ఐకాస నేత సుంకర పద్మశ్రీ ఇంటి వద్ద మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: Murder: విద్యార్థినిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.