ఇవీ చూడండి: ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
బోటు మునకకు ముందు పోలీసులు తీసిన ఫొటోలు ఇవే! - పోలీసులు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద బోటు మునకకు గురైన విషయం తెలిసిందే. అయితే బోటు ప్రమాదానికి ముందు పోలీసులు తీసిన ఫొటోలు బయటకు వచ్చాయి.
పోలీసులు తీసిన ఫొటో ఇదే
ఈనెల 15వ తేదీన ఏపీలోని కచ్చులూరు మందం వద్ద జరిగిన బోటు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బోటులో ప్రయాణిస్తోంది 73 మంది అని అధికారులు చెబితే... ఇంకా ఎక్కువ మంది ఉన్నారని.. పలువురు పేర్కొన్నారు. బోటు ప్రయాణానికి ముందు పోలీసులు తనిఖీ చేసి అనుమతి ఇస్తారు. ఆ సమయంలో ఫొటోలు తీస్తారు. ఇప్పుడు ఆ ఫొటోలతోపాటు ప్రయాణ సమయంలో ఓ పర్యటకుడు తీసుకున్న ఫొటో కూడా బయటకొచ్చింది.
ఇవీ చూడండి: ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం