రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సీపీఐ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పోలీసులు (Police blocked CPI Chalo Raj Bhavan program)అత్యుత్సాహంతో అడ్డుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ( Chadha Venkat Reddy fire on police) మండిపడ్డారు. భాజపా, తెరాస అధికార పార్టీలు ధర్నాలు చేస్తే అవకాశం కల్పించిన పోలీసు యంత్రాంగం... ప్రతిపక్షాలు ధర్నాలు, నిరసనలు తెలియజేస్తే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. కనీసం ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందానికి అయినా.. గవర్నర్‌ను కలిసే అవకాశం ఇస్తే బాగుండేదని అన్నారు. ప్రతిపక్షాల గొంతుక అంటే ప్రజల గొంతుకని ఇప్పటికైనా అధికార పార్టీలు గుర్తించుకోవాలని పేర్కొన్నారు. హిమాయత్ నగర్లోని సీపీఐ కార్యాలయం నుంచి రాజ్ భవన్కు ర్యాలీగా బయల్దేరిన సీపీఐ కార్యకర్తలను అడ్డుకొని(chalo raj bhavan news) పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణను ముందస్తుగా గృహ నిర్భందం చేశారు.
'రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సీపీఐ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకున్నారు. తెలంగాణలో అధికార పార్టీలు ధర్నాలు చేస్తే అవకాశం కల్పించిన పోలీసు యంత్రాంగం, ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తే అడ్డుకోవడం దారుణం. కనీసం ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందానికి అయినా.. గవర్నర్‌ను కలిసే అవకాశం ఇస్తే బాగుండేది. రాష్ట్రంలో ప్రజా ప్రాతినిధ్యం లేదు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం వెళ్తే ముఖ్యమంత్రి సమయం ఇవ్వడం లేదు. గవర్నర్ కూడా సమయం ఇవ్వడంలేదు. ప్రతిపక్షాల గొంతుక అంటే ప్రజల గొంతుకని ఇప్పటికైనా అధికార పార్టీలు గుర్తించాలి.'- చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని(chalo raj bhavan news) పోలీసులు అడ్డుకోవడాన్ని సీపీఐ నగర కార్యదర్శి ఈటీ నరసింహా ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాటకం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం రెండ్రోజులు ధర్నా చేసి రైతుల కోసం దిల్లీ వెళ్లినట్లు సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దిల్లీ వెళ్లింది రైతుల సమస్యల పైన కాదని... యూపీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ (AIMIM)ను పోటీ చేయించే అంశంపై మాట్లాడేందుకే వెళ్లారని ఈటీ నరసింహా ఆరోపించారు. తక్షణమే డ్రామాలు ఆపి.. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీఎస్ బోస్ కోరారు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే తెరాస, భాజపా బండారం బయట పెడతామని హెచ్చరించారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: TRS Ministers Meeting: కేంద్ర వినియోగదారులశాఖ అధికారులతో మంత్రుల భేటీ