ETV Bharat / state

భోలక్​పూర్​లో కరోనాపై అవగాహన కల్పించిన పోలీసులు

author img

By

Published : Jul 5, 2020, 11:01 PM IST

ముషీరాబాద్​ నియోజకవర్గంలోని భోలక్​పూర్​ పరిసర ప్రాంతాల్లో లాక్​డౌన్​ నియమాలు పాటించాలని పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వ్యాపారస్తులు తప్పనిసరిగా లాక్​డౌన్​ నియమాలు పాటించాలని, లేదంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Police awareness Program in Bholakpur
భోలక్​పూర్​లో కరోనాపై అవగాహన కల్పించిన పోలీసులు

భోలక్​పూర్​ పరిసర ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా లాక్​డౌన్​ నియమాలు పాటించాలని ముషీరాబాద్​ ఇన్స్​పెక్టర్​ మురళికృష్ణ సూచించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముషీరాబాద్​ నియోజకవర్గంలోని భోలక్​పూర్​ తదితర ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్టు తెలిపారు.

భోలక్​పూర్​ డెవలప్​మెంట్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ ఏర్పాటు చేసిన ఈ అవగాహన కార్యక్రమంలో లాక్​డౌన్​ నియమాలు పాటించకపోతే.. పరిస్థితి ఎలా ఉంటుందో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. భౌతికదూరం, మాస్కు ధరించడం, శానిటైజర్​ వాడడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని పోలీసులు తెలిపారు. సామూహిక ప్రార్థనలు, విందులు, వేడుకలకు దూరంగా ఉండాలని భోలక్​పూర్​ డెవలప్​మెంట్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ సభ్యులు ప్రజలను కోరారు.

ఇదీ చూడండి: విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.