accused arrested in 7 crore worth gold in Hyderabad :హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రూ.7 కోట్ల విలువైన ఆభరణాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లాలో ఏపీ సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు ఎస్సార్‌నగర్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ తీసుకువచ్చిన తర్వాత శ్రీనివాస్‌ను విచారించనున్నట్లు వెల్లడించారు. నిందితుడి కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు చెప్పారు. చివరకు నాలుగు రోజుల తర్వాత ఇవాళ ఎట్టకేలకు చిక్కాడని వివరించారు.
అసలు ఏం జరిగిందంటే : మాదాపూర్ చెందిన రాధిక నగల దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని బంగారం, వజ్రాభరణాలను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తారు. వినియోగదారులకు నచ్చితే నేరుగా వారి ఇంటి దగ్గరకే డెలివరీ చేస్తారు. ఈ క్రమంలో అనూష అనే ఓ మహిళ రాధిక వద్ద రూ.50లక్షలు విలువ చేసే వజ్రాభరణాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది.
ఈ క్రమంలో రాధిక.. అనూషకు డెలివరీ చేయాల్సిన జువెల్లరీతో పాటు రూ7 కోట్ల విలువైన ఇతర నగలను కూడా బంజారాహిల్స్‌లో ఉండే ఒక జువెల్లర్స్ షాపు నుంచి తీసుకురమ్మని డ్రైవర్ శ్రీనివాస్‌కు చెప్పింది. జువెల్లరీ షాపు యజమాని డ్రైవర్‌తో పాటు తన సేల్స్‌మెన్ అక్షయ్‌ను కూడా వెంట పంపించాడు. ఈ క్రమంలో అక్షయ్.. అనూషకు సంబంధించిన ఆభరణాలను డెలివరీ చేసేందుకు మధురానగర్‌లోని ఇంటికి వెళ్లారు.
అక్షయ్ అలా లోపలికి వెళ్లగా కారులో అతడి కోసం ఎదురుచూస్తున్న డ్రైవర్ పక్కా ప్లాన్ ప్రకారం మిగతా ఆభరణాలు తీసుకుని ఉడాయించాడు. సేల్స్‌మెన్ బయటకు వచ్చేసరికి కారు లేదు.. కారు డ్రైవర్ లేడు. విషయం అర్థమైన అక్షయ్ రాధికకు సమాచారం అందించగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేసి నిందితుడి కోసం నాలుగు రోజులు గాలించి ఇవాళ పట్టుకున్నారు.
ఇవీ చదవండి: