ETV Bharat / state

అర్చకుడి ఇంట్లో దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్​ - hyderabad latest news

సికింద్రాబాద్​ హస్మత్​పేట్​లో ఓ అర్చకుడి ఇంట్లో దొంగతనం కేసులో నిందితుడిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 6తులాల బంగారు, 30తులాల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

police arrested one person for theft in the Priest house in hasmathpet
అర్చకుడి ఇంట్లో దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్​
author img

By

Published : Jan 14, 2021, 5:28 AM IST

సికింద్రాబాద్​ హస్మత్​పేట్​లో ఓ అర్చకుడి ఇంట్లో దొంగతనం కేసులో నిందితుడిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ గోఖులరా ప్రాంతానికి చెందిన నీరజ్ శర్మ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు వారు తెలిపారు. అతను 2008 నుంచి హస్మత్​పేట్, అంజయ్యనగర్​లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నట్లు వెల్లడించారు. అదే ప్రాంతానికి చెందిన సాయిశర్మ స్థానిక దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 8న సాయిశర్మ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం గమనించిన నీరజ్... 9వ తేది రాత్రి అర్చకుడి ఇంట్లో 6తులాల బంగారు, 30తులాల వెండి ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. 12వ తేదిన అనుమానస్పదంగా తిరుగుతున్న నీరజ్​ను విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. అతని నుంచి అభరణాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: నకిలీ ఇన్‌ వాయిస్‌లతో రూ.14.20 కోట్లు కాజేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.