ETV Bharat / state

Ration Rice: రేషన్​ బియ్యంతో అక్రమ దందా చేస్తున్న వ్యక్తి అరెస్టు

పేదల కడుపు కొట్టి వారికి అందాల్సిన బియ్యాన్ని అక్రమమార్గాల్లో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్​ బియ్యాన్ని అక్రమంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి అక్రమదందాను కట్టడి చేశారు.

police arrested man who business illegal pds rice
రేషన్ బియ్యంతో అక్రమ దందా చేస్తున్న వ్యక్తి అరెస్టు
author img

By

Published : Jun 13, 2021, 9:57 PM IST

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యాన్ని హైదరాబాద్​ జియాగూడ ఇమాంపురాలోని ఓ గోదాంలో పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. సుమారు 40 క్వింటాళ్ల బియ్యాన్ని, ఒక వ్యాన్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సమీర్​ కొంతకాలంగా రాజేందర్​నగర్​, పాతబస్తీ, జియాగూడ తదితర చోట్ల రేషన్ డీలర్లతో చేయి కలిపి ఈ అక్రమ దందాకు తెరలేపాడు.

నకిలీ రేషన్ కార్డులు సృష్టించి పీడీఎస్​ బియ్యాన్ని కొనేవాడని.. అనంతరం వాటిని బ్లాక్​మార్కెట్​కు తరలిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సమీర్​పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దందా బాగోతాన్ని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కుల్సుంపుర పోలీసు ఇన్​స్పెక్టర్​ శంకర్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.