ETV Bharat / state

Cyber Gang Arrest in Hyderabad : రూ.712 కోట్ల మోసం.. సైబర్ ముఠా అరెస్ట్.. డబ్బంతా తీవ్రవాదులకు చేరిందా..? - 712 కోట్ల సైబర్​ మోసం వార్తలు

712 Crores Cyber Fraud in Hyderabad : పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 9 మంది సైబర్‌ నేరగాళ్ల ముఠాను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ.712 కోట్లను కొల్లగొట్టినట్లు పోలీసులు తెలిపారు. ముంబయి, దుబాయ్, లఖ్‌నవూ హైదరాబాద్‌కు చెందిన ఈ నిందితులకు.. చైనా దేశస్థులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

cyber gang arrest in hyderabad
cyber gang arrest in hyderabad
author img

By

Published : Jul 22, 2023, 3:06 PM IST

Cyber Fraud Gang Arrest in Hyderabad : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ మోసాలు చేస్తున్న ముంబయి, లఖ్‌నవూ, గుజరాత్, హైదరాబాద్‌లకు చెందిన 9 మంది సైబర్‌ నేరస్థులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 17 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, బ్యాంకు ఖాతాలు, డెబిట్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, గుజరాత్, ముంబయి, లఖ్‌నవూకు చెందిన ఈ నిందితులకు.. చైనా, దుబాయ్​లకు చెందిన నేరస్థులతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ.712 కోట్లను కొల్లగొట్టినట్లు తేల్చిన పోలీసులు.. వారి ఖాతాల్లో ఉన్న రూ.10.50 కోట్ల లావాదేవీలను నిలిపివేశారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

హైదరాబాద్​కు చెందిన ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి రూ.82 లక్షలు మోసపోయినట్లు శుక్రవారం ఫిర్యాదు చేశారని.. దీని ఆధారంగా రంగంలోకి దిగగా.. మరిన్ని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు వివరించారు. నిందితులు చిక్కడపల్లికి చెందిన మరో బాధితుడి నుంచి రూ.17 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. రాధిక మార్కెటింగ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారా అమాయకులను ఆకట్టుకుని.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల ఆశ చూపి డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయించారని పేర్కొన్నారు. ఈ ముఠా 33 డొల్ల కంపెనీల పేరుతో 61 బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు గుర్తించామన్నారు. నిందితులు నగరానికి చెందిన వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించారని.. ఒక్కొక్క బ్యాంకు ఖాతాకు రూ.2 లక్షలు ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే వీరి వెనక చైనా దేశస్థులు ఉన్నట్లు విచారణలో తేలిందని.. చైనాకు చెందిన లీ లో, నన్ యే, కెవిన్‌ జున్ ప్రధాన నిందితులని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే సైబర్ మోసాల పట్ల ప్రజలను చైతన్యపరుస్తున్నామని సీపీ తెలిపారు. కొంతమంది అమాయకులు ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోతున్నారన్నారు. డబ్బులు ఎప్పుడూ సులభంగా రావన్న ఆయన.. డబ్బులు సులభంగా వస్తున్నాయంటే మోసమని గుర్తించాలని సూచించారు. పెట్టుబడుల పేరుతో ఈ ముఠా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ.712 కోట్ల మోసానికి పాల్పడిందని.. ఆ డబ్బునంతా పలు మార్గాల్లో క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్ నుంచి చైనాకు తరలిస్తున్నారని చెప్పారు. తీవ్రవాదులు ఉపయోగించే క్రిప్టో వెబ్‌సైట్‌కు వెళ్లినట్లు తేలిందన్న సీపీ.. జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. హెజ్ బొల్లా అనే క్రిప్టో వాలెట్ ద్వారా కరెన్సీ చైనా బదిలీ అవుతోందని.. దీనిని తీవ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని వివరించారు. అయితే.. నిందితుల నుంచి డబ్బు తీవ్రవాదులకు ఏమైనా చేరిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. ఎన్ఐఏ సహాయం తీసుకొని హెజ్ బొల్లా క్రిప్టో వాలెట్ దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.

పెట్టుబడుల పేరుతో దేశవ్యాప్తంగా రూ.712 కోట్ల మోసానికి పాల్పడిన ముఠాకు చెందిన 9 మందిని అరెస్టు చేశాం. ఈ డబ్బులు పలు మార్గాల్లో క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్ నుంచి చైనా వెళ్తున్నాయి. తీవ్రవాదులు ఉపయోగించే క్రిప్టో వెబ్‌సైట్‌కు వెళ్లినట్లు తేలింది. జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేయాల్సి ఉంది. హెజ్ బొల్లా అనే క్రిప్టో వాలెట్ ద్వారా కరెన్సీ చైనా బదిలీ అవుతోంది. తీవ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. తీవ్రవాదులకు ఏమైనా చేరిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఎన్ఐఏ సహాయం తీసుకొని హెజ్ బొల్లా క్రిప్టో వాలెట్ దర్యాప్తు చేస్తాం.-సీవీ ఆనంద్‌, హైదరాబాద్​ సీపీ

Cyber Gang Arrest in Hyderabad : రూ.712 కోట్ల మోసం.. సైబర్ ముఠా అరెస్ట్.. డబ్బంతా తీవ్రవాదులకు!

ఇవీ చూడండి..

Cyber Fraud: మహేశ్‌ కోఆపరేటివ్ బ్యాంకుపై సైబర్‌ దాడి కేసులో ముమ్మర దర్యాప్తు

CYBER FRAUD: కానుకలంటూ నమ్మిస్తారు.. ఖాతాను ఖాళీ చేస్తారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.