ETV Bharat / state

ఏదో ఒక రోజు తెలంగాణకి ముఖ్యమంత్రిని అవుతా: షర్మిల - police arrested YS Sharmila

తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక రోజు తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానని వైఎస్‌.షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగుల సమస్యపైన దీక్ష చేస్తే అరెస్టులు చేయడమేంటని ఆమె మండిపడ్డారు. నా కార్యకర్తలను వదిలిపెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోనని తెలిపారు. ఇంకోసారి తన మీద చెయ్యిపడితే ఊరుకోనని హెచ్చరించారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ నుంచి పాదయాత్రగా బయల్దేరిన షర్మిలను పోలీసులు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద అడ్డుకుని లోటస్​పాండ్​కు తరలించారు.

వైఎస్​ షర్మిల దీక్ష భగ్నం..
వైఎస్​ షర్మిల దీక్ష భగ్నం..
author img

By

Published : Apr 15, 2021, 7:25 PM IST

Updated : Apr 15, 2021, 9:46 PM IST

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం ఇందిరాపార్కు వద్ద ఆమె దీక్ష చేపట్టారు. అయితే ఒక్కరోజుకే అనుమతి ఉందని.. దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమె దీక్షను భగ్నం చేశారు.ఇందిరా పార్కు వద్ద దీక్ష భగ్నం చేసిన అనంతరం అక్కడనుంచి లోటస్‌పాండ్‌కు నడిచి వెళ్లేందుకు షర్మిల యత్నించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై పోలీసులు ఆమెను అడ్డుకుని అరెస్టు చేసి లోటస్​పాండ్​లోని ఆమె ఇంటికి తరలించారు.

చెయ్యి పడితే ఊరుకునేది లేదు..

అరెస్టును ఖండిస్తూ షర్మిల సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాను 72 గంటల దీక్షకు పూనుకున్నానని.. ఎక్కడికి తరలించినా పాదయాత్రగా వచ్చి మళ్లీ కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానన్న షర్మిల.. అరెస్ట్ చేసిన కార్యకర్తలను వదిలే వరకు మంచినీళ్లు కూడా ముట్టనన్నారు. ఇంకోసారి తనపై చెయ్యి పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్‌ షర్మిల

లోటస్​పాండ్​లోని తన నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నట్టు షర్మిల ప్రకటించారు. మరో రెండ్రోజులు తన ఇంటిముదే కొనసాగిస్తానని..ఇక్కడ కూడా పోలీసులు అడ్డుకుంటే ఇంట్లో దీక్షకు కూర్చుంటానన్నారు. రాబోయో రోజుల్లో తెలంగాణలో మళ్లీ పాదయాత్ర చేస్తానని..బంగారు తెలంగాణ తనతోనే సాధ్యమని షర్మిల చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: షర్మిల దీక్షకు ఒక్కరోజు మాత్రమే పర్మిషన్​

Last Updated : Apr 15, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.