ETV Bharat / state

Lockdown: రాష్ట్రంలో పటిష్టంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌

author img

By

Published : May 26, 2021, 7:36 PM IST

లాక్‌డౌన్‌ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా వాహనాలతో రోడ్లపైకి రాకుండా నియంత్రిస్తున్నారు. సరైన కారణాలు లేకుండా బయటకు వచ్చేవాళ్లు సైతం కొంత దారిలోకి వస్తున్నారు. వాహనాలు సీజ్‌ చేస్తుండటం వల్ల జంకుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ తీసుకునే వారికి మాత్రం పోలీసులు అనుమతించారు. లాక్‌డౌన్‌ ఫలితమిస్తోందని హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు వెల్లడించారు.

రాష్ట్రంలో పటిష్టంగా లాక్‌డౌన్‌
రాష్ట్రంలో పటిష్టంగా లాక్‌డౌన్‌

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతోందని పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. ప్రజల సహకారం, వివిధ శాఖల సమన్వయాన్ని ప్రశంసించారు. రామంతాపూర్‌, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద పోలీస్‌ చెక్‌పోస్ట్‌లను తనిఖీ చేసిన రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ అంబులెన్స్‌ల కోసం గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశామన్నారు. ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో పనిచేసే వారు ఉదయం ఆరు నుంచి 9, సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పని చేయాలని సూచించారు. ఎంజే మార్కెట్ వద్ద పోలీసు తనిఖీ కేంద్రాన్ని సందర్శించిన హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌.. లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. ప్రజలు మరింత సహకరించాలని కోరారు.

ఈ-బైక్‌ పెట్రోలింగ్‌..

లాక్‌డౌన్‌ పరిశీలనలో భాగంగా సైబరాబాద్ పరిధిలో పోలీసులు ప్రయోగాత్మకంగా ఈ-బైక్‌ పెట్రోలింగ్‌కు శ్రీకారం చుట్టారు. మాదాపూర్‌లో ఈ-బైక్స్‌పై తిరుగుతూ లాక్‌డౌన్‌ విధులు నిర్వహించారు. ఆంక్షలు ఉల్లఘింస్తూ నకిలీ ఐడీ కార్డులతో కొందరు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. నిన్న లంగర్‌హౌస్‌లో ఓ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ ఉద్యోగినని ఐడీ కార్డు చూపించగా.. నకిలీదని గుర్తించిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. చిక్కడపల్లి పరిధిలో ఓ ప్రైవేటు ఉద్యోగి తన కారుపై పోలీస్ స్టిక్కర్‌ అంటించుకొని అడ్డంగా దొరికిపోయాడు. వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లి చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన ఐజీ శివశంకర్‌రెడ్డి ఇప్పటి వరకు 7 వేల వాహనాలు సీజ్ చేశామని తెలిపారు.

జిల్లాల్లోనూ..

హన్మకొండలోని పలు కాలనీల్లో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 559 వాహనాలను సీజ్ చేశామని.. మాస్కు ధరించని 3,254 మందికి జరిమానా విధించామని తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ, వైరాలో చెక్‌పోస్ట్‌లను సీపీ విష్ణు వారియర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, ముప్కాల్‌, మెండోరాలో అనుమతి లేని వాహనదారులకు రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో లాక్‌డౌన్‌ను ఏఎస్పీ అనన్య పరిశీలించారు. సిద్దిపేట విక్టరీ చౌరస్తా వద్ద ఏసీపీ రామేశ్వర్ వాహనాలు తనిఖీ చేశారు. సంగారెడ్డిలో డీఎస్పీ బాలాజీ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఇదీ చూడండి: corona: ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు చేస్తున్నాం: డీహెచ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.