PM Narendra Modi Telangana Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన(PM Modi Telangana Tour) షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11న రాష్ట్రానికి రానున్న మోదీ.. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ(BJP Public Meeting)లో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆరోజు సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పరేడ్ మైదానంలో నిర్వహించే మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభాస్థలికి సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు.
సాయంత్రం 5.45 నిమిషాలకు విశ్వరూప సభలో పాల్గొననున్న ప్రధాని(Modi).. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ సభ ముగిసిన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి హైదారాబాద్‌కు రానుండడం ఎన్నికల దృష్ట్యా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎస్సీ వర్గీకరణపై ప్రకటన ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాల సమాచారం.
బీఆర్ఎస్ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారాలు
గత నెల 7న బీసీ ఆత్మ గౌరవ సభలో పాల్గొన్న పీఎం మోదీ : నవంబరు 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభలో ప్రధాని మోదీ పాల్గొని.. ప్రసంగించారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం పాల్గొని బీజేపీతోనే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. సభా వేదికకు వచ్చిన మోదీపై బీజేపీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. ఎల్బీనగర్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సభలో బీజేపీ బీసీలకు చేసిన మేలు ఏంటో ప్రధాని నరేంద్ర మోదీ సవివరంగా వివరించారు.
Telangana Assembly Election 2023 : తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటుందని.. అది బీజేపీతోనే సాథ్యమని మోదీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాణెముకు రెండు బొమ్మలని విమర్శించారు. కేవలం బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అవ్వడానికి కారణం.. బీజేపీనే అంటూ హర్షించారు. తెలంగాణ బీజేపీ అధికారం చేపడితే.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. ఇది కేవలం బీజేపీతోనే సాధ్యమంటూ వివరించారు. అలాగే బీసీలను సీఎం కేసీఆర్ మోసం చేశారని తెలిపారు. బీసీల ఆకాంక్షలను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. ఈ తొమ్మిదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విరోధులు అధికారంలో ఉన్నారని.. ఇంకా వారిని సాగనంపవలసిన అవసరం వచ్చిందని పిలుపునిచ్చారు. ఈసారి బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధాని మోదీనే స్వయంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తారనే భావించిన.. కేవలం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే దానిపైనే మోదీ ప్రసంగించారు. శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాని నాలుగు సార్లు తెలంగాణ పర్యటనకు వచ్చారు. వరంగల్, నిజామాబాద్, పాలమూరు, హైదరాబాద్‌లో పర్యటించారు.
ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ
అధికార పక్షానికి దీటుగా విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారాలు