PM Modi Telangana Tour Today : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అగ్రనేతలు వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. నేడు, రేపు, ఎల్లుండి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఆరు బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో ప్రధాని పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15నిమిషాలకు బహిరంగ సభకు హాజరవుతారు.
PM Modi Election Campaign in Telangana 2023 : అనంతరం 4:15నిమిషాలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో జరగనున్న తుక్కుగూడ బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత 7:35నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని.... అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజ్ భవన్‌కు వెళతారు. రాజ్‌భవన్‌లోనే రాత్రి బస చేయనున్నారు. రేపు ఉదయం 11:30కు కన్హా శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా 2:15కు తుఫ్రాన్‌లో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం నిర్మల్‌కు వెళ్లనున్న ప్రధాని... మధ్యాహ్నం 3:45కు బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని... సాయంత్రం 5:45నిమిషాలకు తిరుపతికి బయలుదేరతారు.
రాత్రి తిరుమలలో బస చేసి.. ఎల్లుండి ఉదయాన్నే స్వామి వారి దర్శనం చేసుకొని.. 1:30నిమిషాలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అవ్వగానే నేరుగా కరీంనగర్ బయలుదేరి.. 2:45నిమిషాలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:40కి హైదరాబాద్ చేరుకొని.. 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి 6:25నిమిషాలకు దిల్లీకి తిరుగుపయనం అవుతారు.
JP Nadda Election Campaign In Telangana : బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ మధ్యాహ్నం 12:30కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పబ్లిక్ మీటింగ్‌కు హాజరవుతారు. తర్వాత సికింద్రాబాద్ చేరుకొని.. 4:30నిమిషాలకు రోడ్ షోలో నడ్డా పాల్గొంటారు. అనంతరం.. 6 గంటలకు ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో రోడ్ షోకు హాజరై ప్రచారం చేస్తారు. రాత్రి 7గంటలకు ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్టీ ముఖ్యనేతలతో నడ్డా సమావేశమవుతారు. ఈ భేటీలో ప్రచార సరళి, విజయావకాశాలు తెలుసుకుంటూనే గెలుపు దిశగా చేపట్టాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే - అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తాం : రాజ్‌నాథ్‌సింగ్
Amit Shah Election Campaign : శుక్రవారం తెలంగాణకు వచ్చి పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా.. ఇవాళ కొల్లాపూర్, మునుగోడు, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు హాజరవుతారు. సాయంత్రం ఖైరతాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటారు. రేపు మక్తల్, ములుగు, భువనగిరిలో ప్రచార సభల్లో పాల్గొంటారు. తర్వాత కూకట్‌పల్లిలో రోడ్ షో చేపడతారు.
శుక్రవారం ఆర్మూర్ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా ఆ తరువాత రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార సరళిని అడిగి తెలుసుకున్న షా.. అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. పార్టీ నాయకులు, శ్రేణులు కష్టపడి విశ్వాసంతో పని చేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు : ఎంపీ లక్ష్మణ్
రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహిచనున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో ఇవాళ సుడిగాలి పర్యటన చేయనున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో యోగీ పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్‌లకు హాజరుకానున్నారు.
తెలంగాణలో పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యే ఉంది : రాజాసింగ్
తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారాలు - గెలుపు కోసం చెమటోడ్చుతోన్న అభ్యర్థులు