ETV Bharat / state

రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం- ఆరు సభలు, హైదరాబాద్​లో రోడ్​ షో, షెడ్యూల్ ఇదే - మోదీ ఎన్నికల ప్రచారం

PM Modi Telangana Election Campaign Schedule : తెలంగాణలో ప్రచారానికి ఇంకా వారం రోజులే గడువుండటంతో బీజేపీ అగ్రనాయకుల ప్రచార షెడ్యూల్ సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్​ని బీజేపీ ప్రకటించింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మొత్తం ఆరు బహిరంగ సభలు, ఒక్క రోడ్​ షోలో పాల్గోనున్నారు.

PM MODI Telangana Tour Details
PM Modi Telangana Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 9:09 PM IST

PM Modi Telangana Election Campaign Schedule : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రానున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం ఆరు బహిరంగ సభలు, హైదరాబాద్​లో రోడ్ షోలో పాల్గొంటారు. 25వ తేదీన మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్ధేరి 2:05 గంటలకు కామారెడ్డికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.

BJP Election Campaign Last Week in Telangana : కామారెడ్డి సభ అనంతరం అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకు చేరుకుంటారు. సాయంత్రం 4:15 నుంచి 4:55 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన రాజ్​భవన్​(Raj Bhavan)కు చేరుకుని.. రాత్రి బస చేయనున్నారు.

ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం, త్వరలో కమిటీ వేస్తాం : ప్రధాని మోదీ

PM MODI 26Th Campaign Schedule : 26న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హా శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు తుఫ్రాన్​కు వెళ్లనున్నారు. 2:15 గంటల నుంచి 2:45 వరకు అక్కడ నిర్వహించే పబ్లిక్ మీటింగ్​లో పాల్గొంటారు. ఆ సభ అనంతరం నిర్మల్​కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభ(Modi Public Meeting in Nirmal)లో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి బయలుదేరనున్నారు.

'బీఆర్​ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మాదిగ విరోధులు - మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తా'

PM MODI 27Th Campaign Schedule : 27వ తేదీన తిరుపతి నుంచి బయల్దేరి 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభ(Modi Election Campaign)లో పాల్గొంటారు. ఆ సభ అనంతరం నేరుగా కరీంనగర్ వస్తారు. 2:45 గంటల నుంచి 3:25 వరకు కరీంనగర్​లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని.. బీజేపీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్​కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోదీ(Modi Road Show) పాల్గొంటారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని 6:25కి దిల్లీకి తిరుగు పయనం అవుతారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో సీఎం వస్తారు : కిషన్​రెడ్డి

నేడు హైదరాబాద్​కు ప్రధాని మోదీ - ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.