ETV Bharat / state

PM Modi Inaugurated Kacheguda Yeswantapur Vande Bharat Train : 'బీజేపీ ప్రభుత్వం.. రైల్వేలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది' - kishanreddy latest news

PM Modi Inaugurated Kacheguda Yeswantapur Vande Bharat Train : ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా కాచిగూడ టూ యశ్వంతపూర్​ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి, గవర్నర్​ తమిళిసై, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​ కుమార్​ జైన్​, ప్రముఖ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Kacheguda and Yeswantapur Vande Bharat Train
PM Modi Inaugurated Kacheguda and Yeswantapur Vande Bharat Train
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 1:40 PM IST

Updated : Sep 24, 2023, 5:12 PM IST

PM Modi Inaugurated Kacheguda Yeswantapur Vande Bharat Train : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హయాంలో రైల్వే శాఖలో నూతన శకం ప్రారంభమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వేలాది రైల్వే స్టేషన్ల అభివృద్ధికి, ఆధునికీకరణకు మోదీ శ్రీకారం చుట్టారని కొనియాడారు. కాచిగూడ రైల్వే స్టేషన్​లో జరిగిన వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని జెండా ఊపీ ప్రారంభించారు.

వందే భారత్ రైలు.. సౌకర్యాలు ఎలా ఉంటాయో చూద్దామా..!

దేశవ్యాప్తంగా నేటి నుంచి మరో తొమ్మిది వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమంగా దిల్లీ నుంచే (Vande Bharat Inauguration) ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఒకేరోజు అత్యంత ఆధునికమైన, వేగవంతమైన వందే భారత్ రైళ్లను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయనన్ తెలిపారు.

ఇక నుంచి తిరుపతికి 8 గంటల్లోనే వెళ్లొచ్చు.. వందేభారత్ ప్రయాణికుల హర్షం

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రైల్వే నెట్ వర్క్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. దానికి న్యాయం చేసేందుకు కొత్త రైళ్ల సర్వేకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కిషన్​రెడ్డి ( Kishan Reddy) పేర్కొన్నారు. రూ.26,000 కోట్లతో తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు కాబోతుందని, దానికి సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్​ను తీసుకురాబోతున్నామని కిషన్​రెడ్డి చెప్పారు.

"బీజేపీ ప్రభుత్వం రైల్వేలో నూతన ఒడికి శ్రీకారం చుట్టింది. వేలాది రైల్వే స్టేషన్ల అభివృద్ధికి, ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ చుట్టూ రూ.26,000 కోట్లతో రింగ్​రోడ్డు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌ చుట్టూ రైల్వే రింగ్‌రోడ్డు వస్తే అభివృద్ధి వేగం పుంజుకుంటుంది." - కిషన్​రెడ్డి, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి

PM Modi Inaugurated Kacheguda Yeswantapur Vande Bharat Train బీజేపీ ప్రభుత్వం రైల్వేలో నూతన ఒడికి శ్రీకారం చుట్టింది

Kacheguda- Yesvantpur Vande Bharat Express Detalis : ఈ స్వదేశీ సెమీ హైస్పీడ్ రైలు హైదరాబాద్​లోని కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమై.. బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వే స్టేషన్‌ వరకు వెలుతుందని రైల్వేశాఖ అధికారులు వివరించారు. మహబూబ్‌నగర్, కర్నూలు టౌన్, అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో వందేభారత్ ఆగుతుందని తెలిపారు. కాచిగూడ- యశ్వంత్‌పూర్ మధ్య 610 కిలోమీటర్ల దూరాన్ని.. 8 గంటల 30 నిమిషాల వ్యవధిలో చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.

Vande Bharat Sleeper Train : త్వరలోనే పట్టాలపైకి వందే భారత్​ స్లీపర్​ రైలు.. తక్కువ ధరలో వెళ్లేందుకు వందే మెట్రో రెడీ!.. ప్రారంభం అప్పుడే..

Vande Bharat Trains in India : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీస్​ రేపటి నుంచి.. యశ్వంత్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభం అవుతుందని అధికాలరులు తెలిపారు. 26వ తేదీ నుంచి కాచిగూడ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ రైలు 8 కోచ్‌లతో నడుస్తుందని.. 7 ఏసీ చైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌ ఇందులో ఉంటాయని చెప్పారు. 530 సీట్ల సామర్థ్యం కలిగివున్న ఈ వందేభారత్ ఎక్స్​ప్రెస్ బుధవారం మినహా వారంలో 6 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు.

Vijayawada Chennai Central Vande Bharat Express : విజయవాడ - చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సైతం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, తమిళనాడులోని చెన్నై సెంట్రల్ మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా వందేభారత్ రైలు పరుగులు తీస్తుంది. ఈ రైలులో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, 7 చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో 530 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం ఉంటుందని రైల్వేశాఖ వెల్లడించింది.

Hyderabad Bengalore Vande Bharat Express Ticket Price : హైదరాబాద్​ టు బెంగళూరు వందేభారత్​ ఎక్స్​ప్రెస్.. రూట్​మ్యాప్​, టికెట్​ రేట్లు ఇవే

Kacheguda Yesvantpur Vande Bharat Express : హైదరాబాద్​ టు బెంగళూరుకు​ వందేభారత్.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Last Updated : Sep 24, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.