PM Modi Telangana Tour: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న రాష్ట్రంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
రాష్ట్రంలో ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు విస్తరించే యోచన ఉంది. శంషాబాద్(ఉందా నగర్) వరకు ఎంఎంటీఎస్ సేవలు పెరగనున్నాయి. మరోవైపు మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ సేవలు పొడిగించే అవకాశం ఉంది. వచ్చేనెలలో ప్రధాని మోదీ పర్యటనలో ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈనెల 28న రాష్ట్రంలో జరగాల్సిన కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వాయిదా పడింది.
ఈ నెల 19న ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగే వందే భారత్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సి ఉండగా అది వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో ఈ నెల 15న వర్చువల్గా వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇతరులపై ఆధారపడే మనస్తత్వం నుంచి బయటపడి.. స్వలంభన దిశగా సాగుతున్న ఆత్మనిర్భర భారతావనికి వందే భారత్ రైలు నిదర్శనమని తెలిపారు.
ఇవీ చదవండి: