వినియోగదారులు కడుతున్న పన్నులతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని.. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉందని ప్రణాలిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్‌కుమార్ అన్నారు. వినియోగదారుల హక్కులపై ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని... తద్వారా ప్రజల్లో నమ్మకం ఏర్పడి వినియోగదారుల హక్కులపై అవగాహన వస్తుందని పేర్కొన్నారు.
జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని... హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో తెలంగాణ వినియోగదారుల ఫోరమ్ ఆధ్వర్యంలో " కరోనా కష్ట కాలంలో అలుపెరుగని సేవకుల అభినందన " సత్కార సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వినోద్ కుమార్ హాజరయ్యారు.
అప్పటి కాంగ్రెస్ హయాంలో తెచ్చిన అత్యుత్తమ చట్టాలలో వినియోగదారుల చట్టం ఒకటని వెల్లడించారు. రాష్ట్రంలో వినియోగదారుల హక్కులపై ఓ కేసును తాను హైకోర్టులో చట్టం వచ్చిన కొత్తలోనే గెలవడం జరిగిందని తెలిపారు.
త్వరలో జిల్లాల వారీగా అధికారిక సమావేశాలు నిర్వహించి.. సమస్యలు, అవగాహన విషయాలపై ముఖ్యమంత్రికి నేరుగా వివరిస్తానని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించే విధంగా ప్రయత్నిస్తాన్నారు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ