ETV Bharat / state

ఉపకులపతి ప్రవీణ్​రావుకు ఎంఎస్​ స్వామినాథన్​ పురస్కారం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు... ఎంఎస్ స్వామినాథన్ పురస్కారానికి ఎంపికయ్యారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి.

Swaminathan_Award
ఉపకులపతి ప్రవీణ్​రావుకు ఎంఎస్​ స్వామినాథన్​ పురస్కారం
author img

By

Published : Mar 12, 2020, 6:45 PM IST

ప్రతిష్ఠాత్మక ఎంఎస్​ స్వామినాథన్​ పురష్కారానికి... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు ఎంపికయ్యారు. దేశంలో వ్యవసాయ రంగం ప్రగతి కోసం తోడ్పాటు అందిస్తున్న శాస్త్రవేత్తలు, వృత్తి నిపుణులకు రెండేళ్లకోసారి ఈ పురస్కారం అందజేస్తారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి.

ఐకార్ పూర్వ డైరెక్టర్ జనరల్ ఆర్‌ఎస్ పరోడా నేతృత్వంలో ఎంపిక కమిటీ... వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో నిష్టాతులైన 13 మంది నుంచి వచ్చిన దరఖాస్తులు, రికార్డులు పరిశీలించింది. కీలక వ్యవసాయ పరిశోధన, బోధన, విస్తరణ, పరిపాలనలో ప్రవీణ్‌రావు పనితీరు ఆధారంగా ఆయన్ని 7వ స్వామినాథన్​ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది.

ఇదీ చూడండి: అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న కమలనాథులు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.