ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం పరిధిలో వ్యవసాయ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం పాలిసెట్ ఫలితాలు వెలువడిన అనంతరం ప్రత్యేకంగా అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. విద్యార్థులు దీనికోసం విడిగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన వెల్లడించారు.
పాలిసెట్ ర్యాంకుల ఆధారంగానే డిప్లొమా కోర్సుల సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో చదివిన వారు మాత్రమే అర్హులని ఆయన ప్రకటించారు. పాలిసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ జూన్ 09 వరకు పొడిగించింది.