ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం చివరి సంయుక్త కౌన్సెలింగ్ ఈ నెల 18న జరగనుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో అధికారులు కౌన్సిలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కోర్సులకు రెండు సార్లు కౌన్సెలింగ్ నిర్వహించిన విషయం విదితమే. మిగిలిన సీట్ల భర్తీ ఈనెల 18న చేపడుతోంది. బీఎస్సీ - అగ్రికల్చర్, బీఎస్సీ - హార్టికల్చర్, బీఎస్సీ - వెటర్నరీ కోర్సుల వారీగా సీట్ల వివరాలు, కౌన్సెలింగ్‌కు పిలిచిన అభ్యర్థుల ర్యాంకుల సమాచారం కోసం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.pjtsau.edu.in లో చూడాలని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ తెలిపారు. బీఎస్సీ డిగ్రీ సీటు లభించిన అభ్యర్థులు వెంటనే 36,450 రూపాయలు రుసుం చెల్లించాలని.. లేనిపక్షంలో ఆ సీటు రద్దవుతుందని ప్రకటించారు. 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నట్లు అధికారులు తెలిపారు. హాజరైన అభ్యర్థులందరికీ సీటు హామీ ఇవ్వబడదని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి :ఈసారి కష్టమే... నియోజకవర్గాలకు నిధుల్లేవ్!