రాష్ట్రంలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు పిరమాల్ గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఈ భారీ పెట్టుబడి పెట్టేందుకు పిరమాల్ గ్రూప్ నిర్ణయం తీసుకొంది.
కేటీఆర్‌తో భేటీ అయిన పిరమాల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమాల్.. రానున్న మూడేళ్లలో రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పిరమల్ ఫార్మాను విస్తరించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడులతో అవకాశం కలుగుతుందని పిరమాల్ వెల్లడించారు. వచ్చే నెలలో తమ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విధానాలు, సరళతర వాణిజ్య విధానం దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లను హైదరాబాద్‌కు తరలించే అంశాన్ని పరిశీలిస్తామని పిరమాల్ గ్రూప్ తెలిపింది.
- ఇదీ చూడండి : 22మంది బాలలకు జాతీయ సాహస పురస్కారాలు