తెరాస ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను.. ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి సమర్థించారు. అణగారిన వర్గాల పట్ల అగ్రవర్ణాల మాట తీరును.. బహిరంగంగానే చెప్పారని పేర్కొన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ దళిత సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ విషయంలో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పినప్పటికీ.. కొంతమంది అనవసర రాజకీయాలు చేస్తున్నారని రవి విమర్శించారు. ఆందోళనలు జరిపే వారు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం చందాల పేరుతో భాజపా నాయకులు దందాలు చేస్తున్నారని రవి ఆరోపించారు. నిర్మాణానికి కేంద్రం రూ. 1300కోట్లను కేటాయించినప్పటికి.. చందాలు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా చందా తీసుకోలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో అధికారమే లక్ష్యం.. ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: సోయం