హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని అనుమాదస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థిని యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న దీపికగా గుర్తించారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో వసతి గృహంలోని స్నానాల గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించిన ఆమె స్నేహితులు యాజమాన్యానికి తెలిపారు. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కర్రతో కొట్టి భర్తను చంపిన భార్య