ETV Bharat / state

కనిష్ఠస్థాయికి పడిపోయిన ఇంధన అమ్మకాలు - లాక్​డౌన్​ నుంచి పెట్రోల్​ బంకులకు పూర్తి మినహాయింపు

రాష్ట్రంలో లాక్​డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినా... పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు అంతగా లేవు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల్లో జరిగే విక్రయాల్లో పదో వంతూ రోజంతా జరగడం లేదు. ఎప్పుడు రద్దీగా ఉండే పెట్రోలు పంపులు అమ్మకాలు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి.

కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఇంధన అమ్మకాలు
కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఇంధన అమ్మకాలు
author img

By

Published : May 21, 2021, 1:13 PM IST

తెలంగాణ రాష్ట్రంలో... దాదాపు మూడున్నర వేల పెట్రోల్‌ పంపుల ద్వారా రోజుకు 9 వేల కిలోలీటర్లు డీజిల్‌, 3 వేల కిలోలీటర్లు పెట్రోల్‌ అమ్ముడు పోతుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి విక్రయాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. జాతీయ రహదారులపై ఉన్న పెట్రోల్‌ పంపులు మినహాయించి మిగిలిన పంపులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు మొదట అనుమతి ఉండేది. ఈ నాలుగు గంటలు కాకుండా మధ్యాహ్నం మూడు గంటల వరకైనా పెట్రోల్‌ పంపులు తెరచుకోడానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

పెట్రోల్​ పంపులకు పూర్తి మినహాయింపు

మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ పనులు జరుగుతుండడం, ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుండడంతో వాహనాలకు డీజిల్‌ కొరత ఏర్పడింది. లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ పంపులను పూర్తిగా మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి పెట్రోల్‌ పంపులు రోజంతా తెరిచే ఉంటున్నాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రోజులో జరిగే అమ్మకాల్లో అయిదో వంతు వరకు జరుగుతున్నాయని పెట్రోల్‌ పంపుల నిర్వహకులు చెబుతున్నారు. ఆ తరువాత... విక్రయాలు జరగడం లేదు.

కనిష్ఠస్థాయికి ఇంధన అమ్మకాలు

అంబులెన్స్‌లతోపాటు ఇతర అత్యవసర వాహనాలు మినహా ఇతర వాహనాలు రోడ్లపైకి ఎక్కువగా రావడంలేదు. ఈ ప్రభావం ఇంధన అమ్మకాలపై పడింది. కొత్తపేట, లక్డీకపూల్‌, నాంపల్లి, మోహిదీపట్నం, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బేగంపేట్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, తారనాక, హబ్సిగూడ లాంటి రద్దీ ప్రదేశాల్లో ఉండే పెట్రోల్‌ పంపులూ బోసిపోయి కనిపిస్తున్నాయి. వాహన రాకపోకలు సాధారణంగా జరిగే సమయంలో... ఈ పెట్రోల్‌ పంపుల వద్ద పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ కోసం వాహనాలు క్యూకట్టి ఉండేవి. లాక్‌డౌన్‌ ప్రభావంతో... అవన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయని విక్రయదారులు చెబుతున్నారు.

ఇలా అయితే నిర్వహణా కష్టమే

లాక్‌డౌన్‌ ఇలానే కొనసాగితే... అరకొర అమ్మకాలతో పెట్రోల్‌ పంపుల నిర్వహణా కష్టమవుతుందని తెలంగాణ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం లాక్‌డౌన్‌ అయినందు వల్ల సహకరించక తప్పదని పేర్కొంది.

ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.