పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో విదేశీ యూనివర్సిటీల్లో డిగ్రీ చదివిన వారికి ఓటు హక్కుపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. విదేశీ డిగ్రీలకు అర్హత కల్పించాలని కోరుతూ బంజారాహిల్స్ కు చెందిన పార్థసారథి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఈసీ ఉత్తర్వుల ప్రకారం విదేశీ యూనివర్సిటీల్లో ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల్లో డిగ్రీ చదివిన వారికి అర్హత లేదని పేర్కొన్నారు. ఈసీ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని.. అప్పటి వరకు ఓటరు జాబితా ఖరారు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఓటరు దరఖాస్తు గడువు కూడా పెంచేలా ఆదేశాలివ్వాలన్నారు. జనవరి 6లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను జనవరి 7కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: సాగుభూముల సందిగ్ధతలకు రెండు నెలల్లో పరిష్కారం: సీఎం