గురుకులాల పీఈటీ, ప్రధాన ఉపాధ్యాయ అభ్యర్థులు హైదరాబాద్లోని ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి పలు పోలీస్టేషన్లకు తరలిచారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2017లో 303 గురుకుల ప్రిన్సిపల్ పోస్టులు, 616 గురుకుల పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
పరీక్షలు కూడా నిర్వహించారు. కోర్టు కేసుల పేరుతో ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ నియామకాలు వెంటనే చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ఉద్యోగం వస్తుందో రాదో తెలియక మరో ఉద్యోగాన్ని వెతెక్కోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని అభ్యర్థులు వాపోయారు.
ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విభజనకు నిర్ణయం: ప్రశాంత్ రెడ్డి