సకాలంలో స్పందించిన పోలీసులు వెంటనే మంటలను ఆర్పేశారు. 25 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆదిల్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ప్రేయసి కోసం ఠాణాలోనే ఆత్మహత్యాయత్నం - ATTEMPT
నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికొచ్చారు. అక్కడే వచ్చింది అసలు సమస్య. అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటం వల్ల మానసికంగా కుంగిపోయాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చి ఠాణాలోనే ఆత్మహత్యకు యత్నించాడు ఓ యువకుడు.
25 శాతం కాలిన గాయాలతో...
ప్రేమించిన యువతితో వివాహానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవటం వల్ల ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు యత్నించాడు. లంగర్‌హౌజ్‌కు చెందిన ఆదిల్... గోల్కొండలో నివాసముంటున్న తన సహవిద్యార్థినితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వివాహానికి అమ్మాయి కుటుంబసభ్యులు నిరాకరించారు. మనస్తాపం చెందిన ఆదిల్ ఫిర్యాదు చేసి... నిప్పంటించుకున్నాడని పోలీసులు తెలిపారు.
సకాలంలో స్పందించిన పోలీసులు వెంటనే మంటలను ఆర్పేశారు. 25 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆదిల్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Intro:Body:Conclusion:
Last Updated : Mar 26, 2019, 9:48 AM IST