శనివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లాల్సిన విమానంలో బాంబు ఉందని చెప్పిన విశ్వనాథం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న విశ్వనాథం తల్లిదండ్రులను చూసేందుకు చెన్నైకు బయల్దేరాడు.
శంషాబాద్ విమానాశ్రయం వద్దకు రాగానే మద్యం మత్తులో విమానాశ్రయ రక్షణాధికారికి చెన్నై వెళ్లే విమానంలో బాంబు ఉందని చెప్పాడు. అప్రమత్తమైన రక్షణ సిబ్బంది అన్ని విమానాలను పరిశీలించారు. ఎక్కడా ఏ ఆధారం దొరకపోవడం వల్ల తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి : వ్యక్తగత లాభాల కోసమే సచివాలయం కూల్చుతున్నారు: రేవంత్ రెడ్డి