ETV Bharat / state

సామాన్య సందర్శకులతో కళకళలాడుతున్న రాష్ట్రపతి నిలయం - telangana latest news

Permission to visit the President's residence in Bollaram: రాష్ట్రపతి దౌపది ముర్ము దక్షిణాది శీతాకాల విడిదిలో ఐదు రోజులు గడిపి దిల్లీ వెళ్లిపోయారు. ఆ తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని తిలకించేందుకు ఈ నెల 15 వరకు సందర్శకులకు అనుమతిచ్చారు. దీంతో పెద్దఎత్తున ప్రజలు ఈ ప్రదేశాన్ని చూసేందుకు తరలివస్తున్నారు.

President's residence in Bollaram
President's residence in Bollaram
author img

By

Published : Jan 4, 2023, 8:21 PM IST

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి

Permission to visit the President's residence in Bollaram: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ప్రజలు సందర్శించేందుకు అధికారులు అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శన వేళలుగా నిర్ణయించారు. దీంతో హైదరాబాద్‌ నగరప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున రాష్ట్రపతి నిలయం అందాలను అస్వాదించేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

రాష్ట్రపతి విడిదిలోని అందాలను చూసి ఆనందిస్తున్నారు. నిలయం ఆవరణలోని వనాల్లో కలియ తిరుగుతున్న సందర్శకులు సంతోషం ప్రకటిస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి విడిది సందర్శనను అధికారులు రద్దు చేశారు. ఇప్పుడు పరిస్థితులు కుదుట పడటంతో మళ్లీ రాష్ట్రపతి నిలయం సందర్శకులతో కళకళలాడుతోంది.

రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనంతోపాటు రాక్ గార్డెన్, ఫౌంటెన్ సందర్శకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. ప్రాంగణంలోని చల్లని వాతావరణంతో పిల్లలు, పెద్దలు సేద తీరుతున్నారు. ఇక్కడున్న ఫ్లవర్ గార్డెన్ చూపరులను ఆకట్టుకుంటోంది. 2010లో ప్రతిభాపాటిల్‌ ఔషధవనాన్ని పెంచి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. వనాన్ని ప్రజలు తిలకించేలా కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు.

అంతకుముందు నిలయం పరిసరాలకు ఎవరినీ అనుమతించేవారు కాదు. 2011 నుంచి రాష్ట్రపతి పర్యటన తర్వాత నిలయాన్ని ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతున్నారు.ఔషధ వనంతోపాటు, నక్షత్ర వనం ప్రత్యేకత కలిగి ఉన్నాయి. నక్షత్ర వనాన్ని ప్రణబ్‌ముఖర్జీ 2013లో అశోక మొక్క నాటి ప్రారంభించారు.

మొదటిసారి రాష్ట్రపతి నిలయంను చూడటానికి వచ్చాను. పచ్చని చెట్లతో ఇక్కడి వాతావరణమంతా ప్రశాంతంగా మనసుకు ఆహ్లాదకరంగా ఉంది.రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనంతోపాటు రాక్ గార్డెన్, ఫౌంటెన్ కొత్త అనుభూతిని పంచుతోంది. ఇక్కడున్న ఫ్లవర్ గార్డెన్ ఆకట్టుకుంటోంది - సందర్శకుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.