రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ వినియోగానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఏడాది పాటు ఈ అనుమతి అమల్లో ఉండనుంది. పౌరుల ఇంటివద్దకే ఆరోగ్య సేవలు అందించడం ప్రధానోద్దేశంగా డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.
కరోనా వ్యాక్సిన్ను డ్రోన్లతో సరఫరా చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఐఐటీ కాన్పూర్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు