ETV Bharat / state

Vegetables Cost in Hyderabad: మార్కెట్​లో ధరల దందా.. కూరగాయల రేట్లు కుతకుత! - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో కూరగాయల(Vegetables Cost in Hyderabad) ధరలు కుతకుతమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. అన్ని కూరగాయల ధరలు మండుతున్నాయి. కూరగాయ వ్యాపారుల మాయాజాలం వినియోగదారుల పాలిట శాపంగా మారుతోంది. రైతుబజార్లలో బోర్డులపై నిర్దేశించిన ధరలకు భిన్నంగా వ్యాపారులు అమ్ముతుండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడం లేదు. కానీ వ్యాపారులు మాత్రం రైతుబజార్లలో ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి దోచుకుంటున్నారు.

vegetables cost in hyderabad, vegetables cost increased
కూరగాయల ధరల పెరుగుదల. మార్కెట్​లో కూరగాయల ధరల్లో హెచ్చుతగ్గులు
author img

By

Published : Nov 2, 2021, 12:57 PM IST

Updated : Nov 2, 2021, 1:59 PM IST

రాష్ట్రంలో కూరగాయల ధరలు(Vegetables Cost in Hyderabad) మండిపోతున్నాయి. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా కూరగాయలు, ఆకుకూరల ధరల్లో హెచ్చుతగ్గులు వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొవిడ్-19 నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థ... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో నిత్యావసర వస్తువుల ధరలు... ప్రత్యేకించి కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఏ కూరగాయలు తీసుకున్నా... ధరలు కుతకుతమంటున్నాయి. నెల రోజులుగా రాజధాని బహిరంగ మార్కెట్‌లో కూరగాయలు, ఆకుకూరల ధరలు ఆకాశాన్నంటేలా పెరిగాయి. టమాట కిలో ధర గతవారం రూ.50 ఉండగా... రైతుబజార్లలో ఇప్పుడు బోర్డుపై రూ.28గా రాశారు. కానీ రూ.30కిపైనే అమ్ముతున్నారు.

ధరలు ఇలా..

  • క్యాప్సికం- రూ.70
  • చిక్కుడు- రూ.60
  • బీన్స్- రూ.60
  • క్యారెట్- రూ.50
  • గోరుచిక్కుడు- రూ.40
  • బీరకాయ- రూ.40
  • సొరకాయ- రూ.40
  • క్యాలీఫ్లవర్-రూ.39
  • వంకాయ- రూ.35
  • టమాట-రూ.28
  • ఉల్లిగడ్డ- రూ.24
  • ఆలుగడ్డ- రూ.21
  • దోసకాయ- రూ.20

మార్కెట్ ఓ విధంగా ఉండాలి. కానీ మనిషికో రేటు చెబుతున్నారు. మార్కెట్​లో ఒకే రేటు ఉండాలి. ఎప్పుడూ కూడా అంతే. బీన్స్​ను ఒకరు రూ.60 కి ఇస్తే... మరొకరు రూ.80 చెప్పారు. మార్కెట్​ లోపల రూ.110 ఉంది. ఇంక ఏ రేట్లని కొనాలి? ఇంతకుముందు ఓ రోజు ఉంది. ఇప్పుడు మరో రేటు ఉంది. వర్షాలు పడితే రైతులకు కూడా ఇబ్బందే.

-వినియోగదారులు

బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు అధికంగా ఉన్నా కూడా తమకు మాత్రం మద్దతు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంతగా చేతులు మారుతున్న సరుకు... ఒక్కో వ్యాపారి తమ లాభాలు అధికంగా వేసుకోవడంతో... వినియోగదారుల దగ్గరకు వచ్చేటప్పటికి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే రైతుబజార్లలో కాస్త తక్కువగా ఉందంటున్నారు.

భారీ వర్షాల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు తగ్గిపోయింది. పెద్ద వ్యాపారులు నేరుగా రైతుల దగ్గర కొనుగోలు చేసి... నగరానికి తీసుకువస్తున్నారు. ఆ తర్వాత ఇష్టారీతిన రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. లక్షల మంది నగర ప్రజలు ఆదివారం మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఆ రోజు ధరలు విపరీతంగా పెంచుతున్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడంతో రవాణా భారం అధికమైంది. అంతేకాకుండా సాగు ఖర్చు పెరిగింది. అందుకే కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి.

-చిన్న వ్యాపారులు

ధరలు మండుతున్న నేపథ్యంలో బహిరంగ, చిల్లర మార్కెట్లో ఏకంగా రూ.10 నుంచి రూ.25 వ్యత్యాసం కనిపిస్తోంది. మార్కెటింగ్‌ అధికారులు నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సిఫారసు ప్రకారం రోజుకు నగరంలో ఒక వ్యక్తి 269 గ్రాముల కూరగాయలు ఆహారంలో తీసుకోవాలి. ఈ లెక్కన గ్రేటర్‌లో ఏడాదికి అవసరమైనవి 722 మెట్రిక్‌ టన్నులు.

రాష్ట్రంలో రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌, యాదాద్రి, పాలమూరు జిల్లాల నుంచి రాజధానికి కూరగాయల సరఫరా జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది 17,772 ఎకరాల విస్తీర్ణంలో సాగవగా... ఈ సీజన్‌లో 14,086 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. మేడ్చల్‌ జిల్లాలో 3,500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా, క్యారెట్‌, చిక్కుడు, క్యాబేజీ, బీన్స్‌, సొర, బీర వంటివి దెబ్బతిన్నాయి. ఉల్లిపాయల ధరలు కూడా రెండు నెలలుగా తగ్గడం లేదు. కర్నూలు టోకు మార్కెట్‌లో రైతుకు రూ.20కి కేజీ లభిస్తుంటే... అదే హైదరాబాద్‌లో పూర్తిగా ఆరినవి కాస్త అటు ఇటుగా కేజీ రూ.35 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. కూరగాయల దిగుమతి కొంతమేర తగ్గడంతో వ్యాపారులు ఇదొక అవకాశంగా మార్చుకున్నారు. ఇప్పుడిప్పుడే సరుకు రాక పెరిగిన దృష్ట్యా ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.

-రమేశ్, రైతు బజారు ఇంఛార్జి

మార్కెట్​లో ధరల దందా

ఆరుగాలం శ్రమించి కూరగాయలు సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పైగా అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. మరోవైపు వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. నగరంలో రైతుబజార్లలో ధరల దందా నేపథ్యంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు ధరల నియంత్రణ చర్యలు తీసుకోవాలని సామాన్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: Healthy Tips: ఆరోగ్యానికి ఆరు సూత్రాలు

Last Updated : Nov 2, 2021, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.