ETV Bharat / state

రెండు పడకల ఇళ్లకోసం తెరాసను నిలదీయండి: కిషన్​రెడ్డి

రెండు పడకగదుల ఇళ్ల కోసమే గత ఎన్నికల్లో తెరాసకు ప్రజలు మూకుమ్మడిగా ఓట్లు వేశారని కిషన్​రెడ్డి తెలిపారు. పేద ప్రజలను భ్రమల్లో ఉంచి ఓట్లను దండుకున్నారని ధ్వజమెత్తారు. సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. దుబ్బాక ప్రజలు మార్పునకు తొలి అడుగు వేశారన్న కిషన్‌రెడ్డి.. అక్కడ స్ఫూర్తితో నగర ప్రజలు భాజపాను గెలిపించాలని కోరుతున్నామన్నారు.

kishan reddy
రెండు పడకల ఇళ్లకోసం తెరాసను నిలదీయండి: కిషన్​రెడ్డి
author img

By

Published : Nov 22, 2020, 12:41 PM IST

Updated : Nov 22, 2020, 2:28 PM IST

రెండు పడక గదుల ఇళ్ల కోసమే గత ఎన్నికల్లో ప్రజలు తెరాసకు ఓటేశారని కిషన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్లు పూర్తయినా.. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేకపోయారని విమర్శించారు. హామీలు అమలుచేయని తెరాసను ప్రజలంతా ప్రశ్నించాలని సూచించారు. గత ఎన్నికలకు ముందు ఐడీహెచ్ కాలనీలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారన్న కిషన్​రెడ్డి.. బస్తీల్లోని ప్రజలను వాహనాల్లో తరలించి సనత్‌నగర్‌లో ఐడీహెచ్ ఇళ్లను చూపించారని ఆరోపించారు. పేద ప్రజలను భ్రమల్లో ఉంచి ఓట్లను దండుకున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం..హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారని కిషన్​రెడ్డి తెలిపారు. భారీ వర్షాలతో.. భాగ్యనగరం సముద్రంగా మారడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. ఆక్రమణలు, నాలాల్లో పూడిక వల్లే వరదలు వచ్చాయని.. నగరంలో సుమారు 6 లక్షల ఇళ్లలోకి నీరు చేరిందన్న కిషన్‌రెడ్డి.. కనీసం రహదారులపై గుంతలను కూడా పూడ్చలేదని ఆరోపించారు. వరదల కారణంగా 40 మంది అమాయక ప్రజలు చనిపోయారని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా హైదరాబాద్ సముద్రంగా, కార్లు పడవలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మెట్రోను అడ్డుకున్నారు..

హైదరాబాద్ మెట్రోను కేసీఆర్ తీసుకురాలేదన్న కిషన్‌రెడ్డి.. వేగంగా జరుగుతున్న పనులను అడ్డుకున్నారని ఆరోపించారు. మెట్రో పనుల్లో జాప్యం కారణంగా రూ.3 వేల కోట్లపైగా అదనపు భారం పడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పాతబస్తీలోకి మెట్రో రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ సీఎం కాకముందే మెట్రో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దత్తాత్రేయ.. ఎంఎంటీఎస్‌ను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకురాలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన నిధులనూ విడుదల చేయలేదని మండిపడ్డారు. యాదాద్రి వరకు పొడిగించిన ఎంఎంటీఎస్​ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు.

జీహెచ్‌ఎంసీ ఖజానాను ఖాళీ చేశారు..

మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేకపోయారని.. నదీతీరం కబ్జాలకు గురవుతోందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ రక్షణ లేదు.. ప్రక్షాళన లేదని మండిపడ్డారు. దుబారా ఖర్చులతో జీహెచ్ఎంసీని కూడా అప్పులమయం చేశారని ఆరోపించారు. జీతాల కోసం కార్మికులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేయాల్సిన దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. అవినీతి కారణంగానే జీహెచ్‌ఎంసీకి వచ్చే రెవెన్యూ తగ్గిపోతోందని.. భాజపాను గెలిపిస్తే జీహెచ్‌ఎంసీ ఆదాయాన్ని మౌలిక వసతులకు ఖర్చు చేస్తామన్నారు.

తెరాస.. ఐదేళ్లు ఏమి చేసిందని చెప్పి ఓట్లు అడుగుతున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవాలని తెరాస ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాయిలాలు, తప్పుడు ప్రచారాలు, డబ్బు పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. భాజపాను ఆదరించాలని నగర ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. పాతబస్తీ ఓవైసీ కుటుంబం చేతిలో ఉంటే.. కొత్తనగరం కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందన్నారు. భూకబ్జాలు, వర్షానికి ఇళ్లు, ప్రాణాలుపోయే తెలంగాణను ప్రజలు కోరుకోలేదని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో.. దుబ్బాక ప్రజలు మార్పునకు తొలి అడుగు వేశారన్న కిషన్‌రెడ్డి.. అక్కడ స్ఫూర్తితో నగర ప్రజలు భాజపాను గెలిపించాలని కోరుతున్నామన్నారు. ప్రపంచంలో సచివాలయం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇస్తూనే ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్​తో భాజపాకు అవినాభావ సంబంధం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అన్నివర్గాలతో మమేకమవుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవాలనే అంకితభావంతో పనిచేస్తున్నామన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నా సద్వినియోగం చేసుకుంటామన్నారు.

రెండు పడకల ఇళ్లకోసం తెరాసను నిలదీయండి: కిషన్​రెడ్డి

ఇవీచూడండి: ఇది అహ్మదాబాద్‌ కాదు హైదరాబాద్‌.. భాజపాపై కేటీఆర్ ఫైర్

Last Updated : Nov 22, 2020, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.