భాగ్యనగరం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో (తూర్పు)ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను ప్రజలంతా వినియోగించుకోవాలని సూచించారు. తూర్పు ప్రాంతానికి చెందిన రియాల్టర్లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులు, సరికొత్త ప్రాజెక్టులను ఒకే చోట ప్రదర్శించనున్నట్లు క్రెడాయ్ అధ్యక్షులు రామకృష్ణారావు తెలిపారు.
మొత్తం 62కి పైగా స్టాల్స్ ద్వారా అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫ్లాట్స్, వాణిజ్య ప్రదేశాలను ప్రదర్శనకు ఉంచారు. తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో వినియోగదారులకు అత్యుత్తమ అవకాశాలను అందిస్తున్నట్లు డెవలపర్లు తమ ప్రదర్శనాల ద్వారా తెలియజేశారు.
ఇవీ చూడండి : ఛలో ట్యాంక్‌బండ్: రాజకీయ నేతల గృహ నిర్బంధం