హైదరాబాద్ సనత్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కరోనా రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ పాల్గొన్నారు. సుమారుగా 150 మందికి పైగా ప్రజలు ఈరోజు టీకా తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అదే విధంగా అమీర్‌పేటలోని ఆరోగ్య కేంద్రంలో కొరకు 100 మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు.
టీకాలు తీసుకున్న వారు కూడా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని డాక్టర్ రేఖ అన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చదవండి : 'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'