ETV Bharat / state

పరీక్షాకేంద్రాలపై నిరసన.. తమ ప్రాంతాల్లో వద్దంటున్న స్థానికులు - corona testing centers news

ఒకవైపు కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుంటే విరివిగా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తెచ్చిన పరీక్షా కేంద్రాలతో మరో సమస్య ఉత్పన్నమైంది. వీటిని ఇంకెక్కడైనా ఏర్పాటు చేయండి.. తమ ప్రాంతాల్లో వద్దంటూ స్థానికులు నిరసనల పర్వానికి తెర లేపారు. దీంతో వైద్యులు పరీక్షల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు.

people protest on corona testing centers in those areas
పరీక్షాకేంద్రాలపై నిరసన.. తమ ప్రాంతాల్లో వద్దంటున్న స్థానికులు
author img

By

Published : Jul 17, 2020, 7:50 AM IST

హైదరాబాద్​ కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో 11 డివిజన్లుంటే వాటిల్లో 7 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో ఒకటి పీహెచ్‌సీ, మిగతా 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు. ఈ 7 కేంద్రాల్లో వారంరోజులుగా కొవిడ్‌ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనం ఎక్కువగానే వస్తున్నారు.

ఫిరోజ్‌గూడ నుంచి కేపీహెచ్‌బీకి మార్పు

  • వారంరోజులుగా బాలానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఫిరోజ్‌గూడ సామాజిక భవనంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానికులు వందలాది మంది ఇప్పటికే పరీక్షలు చేయించుకున్నారు. కొద్దిరోజులుగా ఈ కేంద్రాన్ని తొలగించాలని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • జనావాసాల మధ్య ఉండడం వలన స్థానికంగా కరోనా వ్యాప్తి చెందుతుందని ఒత్తిడి చేస్తుండడంతో వైద్యులు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇక చేసేదిలేక బుధవారం ఈ కేంద్రాన్ని కేపీహెచ్‌బీకాలనీ రమ్యా మైదానం వద్దకు మార్పుచేశారు.
  • హనుమాన్‌నగర్‌ ఆరోగ్య కేంద్రం వారు పాపిరెడ్డినగర్‌ పార్కు వద్ద జీహెచ్‌ఎంసీ భవనంలో పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీన్ని తొలగించాలని స్థానిక మహిళ వైద్యురాలిపై ఒత్తిడి తీసుకొస్తోంది.
  • ఎల్లమ్మబండ పరీక్షా కేంద్రం పక్కనే వాటర్‌ ట్యాంక్‌ ఉండడంతో పరీక్షలు నిలిపేయాలని స్థానికులు ఒత్తిడి చేస్తున్నారు.

అక్కడ అంత్యక్రియలు వద్దంటూ..

వనస్థలిపురం: కరోనా మృతులకు సాహెబ్‌నగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించకూడదని పేర్కొంటూ గురువారం రాత్రి మృతదేహంతో వచ్చిన ఓ అంబులెన్స్‌ను స్థానికులు అడ్డుకున్నారు. విషయం బీఎన్‌రెడ్డినగర్‌ కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న దృష్టికి వెళ్లడంతో ఆమె శ్మశానవాటికకు చేరుకున్నారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను ఇక్కడికి తేవడం వల్ల స్థానికులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉందన్నారు. సిబ్బందితో మాట్లాడి మృతదేహాన్ని వెనక్కి పంపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.