కరోనా సెంకడ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. jోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. మరోవైపు ప్రజల్లో కరోనా నిబంధనల పట్ల అలసత్వం వైరస్ వ్యాప్తికి కారణం అవుతోంది. ప్రభుత్వాలు, వైద్యులు మాస్కుల వినియోగాన్ని వివరిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ఫైన్లు విధిస్తున్నా నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు.
కొన్ని ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ఇంకా కరోనా ఉందా..! మాస్క్ వేసుకోవాలా..? అనుకునే వారు కొందరైతే.. మాస్క్ ముఖానికి తగిలిస్తే సరిపోతుంది.. ముక్కుకు వేసుకోవాలా ఏంటి అనేవారు ఇంకొందరు... ఈ పరిస్థితి కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది నిత్యం రద్ధీగా ఉండే గుడిమాల్కాపూర్ పూల మార్కెట్. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..
ఇదీ చూడండి: కరోనా అలర్ట్: రాష్ట్రంలో కొత్తగా మరో 3187 కొవిడ్ కేసులు