గ్రేటర్ హైదరాబాద్లోని పలు ఆరోగ్య కేంద్రాల్లో.. సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలను వేధిస్తోంది. ముషీరాబాద్, భోలక్ పూర్, కవాడిగూడ కేంద్రాల్లో.. వేర్వేరుగా టోకెన్ నంబర్లు ఇస్తూ సిబ్బంది తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు కేంద్రం ఎదుట ఆందోళన చేయడంతో.. వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. కేంద్రానికి చేరుకున్న పోలీసులు.. ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఉదయం 7 గంటలకు టోకెన్లు ఇచ్చి.. మళ్లీ 10 గంటలకు మరోసారి టోకెన్లు ఇస్తూ తమను అయోమయానికి గురి చేస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద అవస్థలు పడుతోన్న వృద్ధులను చూసైనా.. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా కిట్ల కొరత.. భవిష్యత్తులో టెస్టులు సందేహమే.!