ETV Bharat / state

20 రోజులుగా జలదిగ్బంధం... బిక్కుబిక్కుంటున్న కాలనీవాసులు - వరద నీరు

ఇరవై రోజులుగా చీకట్లోనే వారి జీవనం. కడుపునిండా తిండిలేదు. కంటినిండా నిద్రలేదు. అడుగుబయటపెడితే ఆగమాగం. భారీ వర్షాలతో అతలాకుతలమైన కొంపల్లిలోని ఉమామహేశ్వరకాలనీ దయనీయ పరిస్థితి ఇది.

people-are-facing-trouble-with-flood-water-from-20-days-in-kompalli-hyderabad
20 రోజులుగా జలదిగ్బంధం... బిక్కుబిక్కుంటున్న కాలనీవాసులు
author img

By

Published : Nov 5, 2020, 3:59 PM IST

హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలు ఇంకా వాటి నుంచి బయటకు రాలేకపోతున్నాయి. కొంపల్లిలోని ఉమామహేశ్వర కాలనీ ప్రజలు జలదిగ్బంధం నుంచి బయటికి రాలేక 20 రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

20 రోజులుగా జలదిగ్బంధం... బిక్కుబిక్కుంటున్న కాలనీవాసులు

గత నెల 13న వరుణుడి ప్రతాపంతో... ఈ కాలనీ మొత్తం నీటమునిగింది. ఎగువ ప్రాంతాల్లోని డ్రైనేజీ నీటితో పాటు... జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ చెరువు నీరు ఇప్పటికీ ఈ కాలనీలోకే చేరుతోంది. వరదల కారణంగా ఈ కాలనీని అధికారులు ఖాళీ చేయించగా... కొన్ని రోజులుకే వారంతా తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. అప్పటి నుంచి వీరంతా బురదలోనే కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు కాలనీపై దృష్టి సారించి వరద ముంపు నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: లారీల మధ్య ఇరుక్కున్న కారు​... 2 కి.మీల మేర ట్రాఫిక్ జామ్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.