ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. 2015లో లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కోసం చేసుకున్న పలు దరఖాస్తులు వివిధ కారణాల రీత్యా పరిష్కారం కాలేదు. వాటిని పరిష్కరించేందుకుగాను పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
పాత దరఖాస్తులను కూడా 2020 ఎల్ఆర్ఎస్ విధివిధానాలకు అనుగుణంగానే పరిష్కరించాలని, అటువంటి వారి నుంచి కొత్తగా మళ్లీ దరఖాస్తులు స్వీకరించరాదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నింటినీ డిసెంబర్ నెలాఖరు వరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్‌శాఖ అధికారులకు డీజీపీ సూచనలు