తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు సుఖంగా బతుకుతున్నారని చెప్పగలవా? అని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్‌ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. విఠల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మోచేతి నీళ్లు తాగడం అలవాటైందని విమర్శించారు. ప్రస్తుతం పదవి లేనందునే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ పదవి వస్తే ఎక్కడా కనిపించరని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ సబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పదవి తీసుకున్నారని విమర్శించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల మెస్‌లు లేవని చెప్పినప్పుడుకాని, విశ్వవిద్యాలయాలకు దీర్ఘకాలంగా ఉపకులపతులు లేకపోయినా రోజు నోరు మెదపలేదని విమర్శించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలతో పాటు మిగిలిన యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు లేరన్న విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
ఇదీచూడండి: పేరుకే తెలంగాణ కుంభమేళా.. జంపన్నవాగులో మాత్రం సమస్యల మేళా..!