హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్తో తానే ఫోన్లో మాట్లాడానని.. దురుసుగా ప్రవర్తించారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 'సేవ్ ఇండియా-సేవ్ కానిస్టిట్యూషన్' కార్యక్రమానికి ముందే అనుమతి కోరామన్నారు. తిరంగ ర్యాలీకి ఇవ్వకుంటే సత్యాగ్రహ దీక్షకు అనుమతి కోరామని.. వాటికీ నిరాకరించారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసే హక్కు, చట్టం ఎవరు కల్పించారని ప్రశ్నించారు. పోలీసుల వైఖరిపై ఇవాళ గవర్నర్ తమిళి సైని కాంగ్రెస్ నేతలు కలిపి ఫిర్యాదుచేశారు. హైదరాబాద్లో గవర్నర్కున్న అధికారాలు వివరించామని... అంజనీ కుమార్ తీరుపై విచారణ జరిపించాలని కోరామని ఉత్తమ్ తెలిపారు.
ఇవీ చూడండి: సరళాసాగర్ గండికి కారణాలు ఆపాదించొద్దు: నిరంజన్ రెడ్డి